Share News

Chopped Vegetable in Fridge: ఈ కూరగాయల ముక్కలను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టొద్దు

ABN , Publish Date - Mar 02 , 2025 | 09:39 PM

కొన్ని రకాల కూరగాయ ముక్కలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచొద్దని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Chopped Vegetable in Fridge: ఈ కూరగాయల ముక్కలను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టొద్దు

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రిజ్‌లో మనం రకరకాల ఆహార వస్తువులనునిల్వ ఉంచుతాము. ఇలా చేస్తే వాటి తాజాదనం, పోషకాలు, రుచి ఎక్కువ సమయం పాటు నిలిచి ఉంటాయి. అయితే, కొన్ని రకాల కూరగాయలను తరిగాక ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు (chopped vegetables should not be kept in fridge).

ఉల్లిపాయల ముక్కల నుంచి తేమ, సల్ఫర్ కాంపౌండ్స్‌ విడుదల అవుతాయి. దీంతో, ఫ్రిజ్‌లో ఇతర ఆహారాలపై ప్రభావం పడుతుంది. కాబట్టి, ఉల్లిగడ్డలను బయట ఉంచడమే మంచిది.

వెల్లుల్లి ముక్కలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచితే అవి జగటగా మారిపోతాయి. వాసన, రుచి కూడా చెడిపోతాయి. కాబట్టి వీటిని కూడా బయట ఉంచడమే మేలు


Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా

బంగాళదుంప ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచితే ఆక్సిడేషన్ కారణంగా అవి ముదురు గోధుమ రంగులోకి మారిపోతాయి. చల్లటి వాతావరణం కారణంగా బంగాళదుంపలోని చక్కెరల స్వభావం కూడా మారుతుంది. చివరకు రుచి తగ్గుతుంది. కాబట్టి, బంగాళదుంపలను తరగకుండానే ఫ్రిజ్‌లో నిల్వ ఉంచాలి

టమాటా ముక్కలను కూడా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకూడదు. వీటి వల్ల అవి బాగా మెత్తబడి రుచి తగ్గిపోతుంది. కాబట్టి, టమాటాలను యథాతథంగా బయట ఉంచడమే మేలు

దోస, కీర దోస ముక్కలను ఫ్రిజ్‌లో ఉంటే అవి బాగా నీరు పట్టినట్టు అయిపోతాయి. కరకరలా స్వభావాన్ని కోల్పోతాయి. కాబట్టి, వీటిని యథాతథంగా ఫ్రిజ్‌లో ఉంచడమే మేలు

తరిగిన క్యారెట్ ముక్కలను ఫ్రిజ్‌లో పెడితే అవి త్వరగా ఎండిపోయినట్టు అయిపోతాయి. వాటి రుచిలో కూడా మార్పు వచ్చేస్తుంది.


Protecting Eyes from Pollution: కాలుష్యం నుంచి కంటిని కాపాడుకోవాలా.. ఇలా చేయండి

ఇక తరిగిన వంకాయలను కూడా ఫ్రిజ్‌లో ఉంచకపోవడమే మంచిది. తరగిన వంకాయలు త్వరగా ఆక్సిడైజ్ అయ్యి రంగు మారిపోతాయి. చివరకు చేదుగా కూడా మారతాయి. కాబట్టి వీటిని కూడా యథాతథగా బయట లేదా ఫ్రిజ్‌లోపల నిల్వ చేయాలి.

ఇక కూరగాయలు ఫ్రిజ్‌లో పెట్టాలనుకుంటే ముందుగా వాటిని బాగా కడిగి అప్పుడు లోపల పెట్టుకోవాలి. తరిగిన కూరగాయలను ఫ్రిజ్‌లో పెట్టాలనుకుంటే ముందుగా వాటిని ఓ ప్లాస్టిక్ గిన్నెలో ఉంచి టైట్‌గా మూత పెట్టి దాన్ని ఫ్రిజ్‌లో నిల్వచేయాలి. ఇథిలీన్ ఉత్పత్తి చేసే కూరగాయలను మిగతా వాటికి దూరంగా ఉండేలా ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. కూరగాయలను క్రిస్పర్ డ్రాయర్‌లో పెడితే ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. మాంసం, పాల ఉత్పత్తులకు దూరంగా కూరగాయలను ఫ్రిజ్‌లో పెట్టాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఫ్రిజ్‌లోని ఆహారాలు రంగు రుచి కోల్పోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

Read Latest and Health News

Updated Date - Mar 02 , 2025 | 09:39 PM