Share News

Protein Foods: శాఖాహారులకు బెస్ట్ చాయిస్.. గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాలు ఇవే..

ABN , Publish Date - Jun 26 , 2025 | 04:44 PM

వెజిటేరియన్లకు బలాన్ని ఇచ్చే సూపర్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Protein Foods: శాఖాహారులకు బెస్ట్ చాయిస్.. గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాలు ఇవే..
Protein Foods

Protein Foods: మన శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన పోషకాలలో ప్రోటీన్ ఒకటి. ఇది కణాలను నిర్మించడానికి, మరమ్మతు చేయడానికి అలాగే హార్మోన్లు, ఎంజైమ్‌లను తయారు చేయడానికి అవసరం. ప్రోటీన్లు అమైనో ఆమ్లాలతో తయారవుతాయి. మానవ శరీరంలో వివిధ విధులు నిర్వహించడానికి, కండరాలు, ఎముకలను నిర్మించడానికి, అలాగే కణాల పనితీరుకు ప్రోటీన్లు అవసరం.


గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంతే కాదు, ఇందులో విటమిన్లు A, D, E, B12, ఫోలేట్, ఐరన్, సెలీనియం, కోలిన్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. కానీ, గుడ్లు తినని శాఖాహారులకు ప్రోటీన్ ఎక్కడి నుండి వస్తుంది? అని చాలా మంది సందేహ పడుతుంటారు. అయితే, వెజిటేరియన్లకు బలాన్ని ఇచ్చే సూపర్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన శాఖాహార ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టోఫు : 10 గ్రాములు

పనీర్ : 14 గ్రాములు

గ్రీకు పెరుగు : 10 గ్రాములు

సోయా చంక్స్ : సరిగ్గా 52 గ్రాములు

క్వినోవా : 14 గ్రాములు

సోయాబీన్స్ : 19 గ్రాములు

చిక్‌పీస్ : 9 గ్రాములు

కిడ్నీ బీన్స్ : 9 గ్రాములు

వేరుశెనగలు : 25 గ్రాములు

బాదం : 21 గ్రాములు

పిస్తాపప్పులు : 20 గ్రాములు

అవిసె గింజలు : 18 గ్రాములు

చియా విత్తనాలు : 17 గ్రాములు

గుమ్మడికాయ గింజలు : 19 గ్రాములు

పొద్దుతిరుగుడు విత్తనాలు : 21 గ్రాములు

జనపనార విత్తనాలు : 32 గ్రాములు


రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం?

రోజుకు ఎంత ప్రోటీన్ అవసరమనేది వ్యక్తి వయస్సు, శారీరక శ్రమ, ఇతర ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, పెద్దలకు రోజుకు కిలోగ్రాము శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. అంటే 70 కిలోల వ్యక్తికి రోజుకు 56 గ్రాముల ప్రోటీన్ అవసరం అవుతుంది. అయితే, చురుకుగా ఉండే వ్యక్తులు, కండరాలు పెంచడానికి ప్రయత్నించేవారు లేదా కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి ఎక్కువ ప్రోటీన్ అవసరం కావచ్చు.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

బద్దకానికి కారణమయ్యే ఆహారాలు ఇవే..

పళ్ల చిగుళ్లు ఎందుకు ఉబ్బుతాయి? నివారణకు ఏం చేయాలి?

For More Health News

Updated Date - Jun 26 , 2025 | 06:23 PM