Share News

Tea Biscuit Side Effects: టీ బిస్కెట్ కాంబినేషన్.. ఆరోగ్యానికి హానికరం..

ABN , Publish Date - May 22 , 2025 | 02:41 PM

టీతో బిస్కెట్ తినడం ఒక సాధారణ అలవాటు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఎందుకంటే...

Tea Biscuit Side Effects: టీ బిస్కెట్ కాంబినేషన్.. ఆరోగ్యానికి హానికరం..
Tea Biscuit

Tea Biscuit Side Effects: చాలా మంది ఉదయం నిద్ర లేవగానే టీతో బిస్కెట్ తింటారు. టీతో బిస్కెట్ తినడం ఒక సాధారణ అలవాటు. కొంతమందికి అలా తినడం వల్ల కొద్దిగా తృప్తి కలుగుతుంది. టీతో బిస్కెట్ తినడం వల్ల టీ రుచి బాగుంటుందని అంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది ఆరోగ్యానికి హానికరం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, టీతో బిస్కెట్ తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..


బరువు పెరగడం:

బిస్కెట్లలో కేలరీలు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఉదయాన్నే టీతోపాటు బిస్కెట్లను తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.

మధుమేహం:

బిస్కెట్లలో అధికంగా చక్కెర ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది మధుమేహానికి దారితీస్తుంది. కాబట్టి, టీతో బిస్కెట్ తినకపోవడం మంచిది.

గుండె జబ్బులు:

బిస్కెట్లలో అధిక కొవ్వులు ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల బీపీ సమస్య కూడా పెరుగుతుంది. కాబట్టి, ఎట్టి పరిస్థితిలోనూ ఉదయాన్నే టీతోపాటు బిస్కెట్లు తినకండి.

జీర్ణ సమస్యలు:

బిస్కెట్లు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మీరు ఉదయాన్నే టీతో వాటిని కలిపి తీసుకుంటే ఇది జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

హార్మోన్ల అసమతుల్యత:

బిస్కెట్లు హార్మోన్ల పనితీరును కూడా దెబ్బతీస్తాయి. కాబట్టి, ఉదయాన్నే వీటిని తీసుకోకపోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.


Also Read:

Doctor Fears Job Loss: నా జాబ్ పోవడం పక్కా.. ఇక రెస్టారెంట్‌లో పని చేసుకోవడమే.. డాక్టర్ పోస్టు వైరల్

India Vs Pakistan: భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్

For More Health And Telugu News

Updated Date - May 22 , 2025 | 02:41 PM