Share News

Health Tips: ఈ నీటితో స్నానం చేస్తే 6 అద్భుతమైన ప్రయోజనాలు..

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:36 PM

చలికాలంలో చాలా మంది వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడుతారు. అయితే, చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని మీకు తెలుసా?

Health Tips: ఈ నీటితో స్నానం చేస్తే 6 అద్భుతమైన ప్రయోజనాలు..
Bath

Health Tips: చలికాలంలో చాలా మంది వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడుతారు. అయితే, చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని మీకు తెలుసా? ఇది మీ శరీరాన్ని దృఢంగా మార్చడమే కాకుండా 6 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అవెంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

1. రోగనిరోధక శక్తి:

చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జలుబు, దగ్గు, ఇతర సీజనల్ వ్యాధులను నివారించడానికి ఇది సహజ నివారణ.

2. ఒత్తిడి తగ్గిస్తుంది:

చల్లని నీరు మీ శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ల స్థాయిని పెంచుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. సహజ ఒత్తిడి నివారిణిగా చల్లని నీరు పనిచేస్తుంది.

3. జుట్టుకు మేలు చేస్తుంది:

వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. కానీ, చల్లటి నీరు మీ చర్మాన్ని హైడ్రేట్‌గా మెరుస్తూ ఉంటుంది. దీనితో పాటు జట్టును బలపరుస్తుంది.


4. శరీరానికి శక్తి:

చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి ఉత్తేజం వస్తుంది. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. అంతేకాకుండా సోమరితనాన్ని దూరం చేస్తుంది.

5. కండరాల పునరుద్ధరణలో..

చల్లని నీరు శరీరంలోని కండరాల అలసటను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

6. బరువు తగ్గడానికి..

చల్లటి నీటితో స్నానం చేసినప్పుడు, ఉష్ణాగ్రత సమతుల్యంగా ఉండటానికి శరీరం ఎక్కువ కేలరీలు బర్న్ చేయాల్సి ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

(Note: ఈ కథనం ఆరోగ్య నిపుణుల సమాచారం మేరకు ఇవ్వబడింది. ABN న్యూస్ దీనిని ధృవీకరించలేదు.)

Updated Date - Jan 04 , 2025 | 04:36 PM