Share News

Health Tips: బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..

ABN , Publish Date - Jul 01 , 2025 | 08:49 AM

బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా? అయితే, ఈ ముఖ్య విషయాలు తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Health Tips:  బరువు తగ్గడానికి భోజనం మానేస్తున్నారా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..
Weight Loss

Health Tips: చాలా మంది బరువు తగ్గడానికి భోజనం మానేస్తారు. అయితే, ఇది మంచి పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, భోజనం తినకపోతే శరీరానికి శక్తి అందదు. ముఖ్యంగా, భోజనం మానేస్తే శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు అందవు. దీనివల్ల శరీరంలో శక్తి తగ్గి, రోజూవారీ పనులు చేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది.


భోజనం మానేయడం వల్ల తక్కువ కేలరీలు తీసుకోవడం నిజమే, కానీ ఇది మీ శరీరానికి హాని కలిగిస్తుంది. భోజనం మానేసినప్పుడు జీవక్రియ మందగిస్తుంది. ఇది బరువు తగ్గడం కష్టతరం చేస్తుంది. భోజనం మానేసిన తర్వాత మీరు ఆకలితో ఎక్కువ తినే అవకాశం ఉంది. ఇది బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరగడానికి దారితీస్తుంది.


భోజనం మానేయడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, సమతుల్య ఆహారం తీసుకోవడం, అవసరమైన పోషకాలను పొందడం ముఖ్యం. వ్యాయామం చేయడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజుకు తగినంత నిద్రపోవడం వల్ల హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవచ్చు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ సమతుల్య భోజనం చేయండి. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

ఈ 5 అలవాట్లు పాటిస్తే.. వయస్సు పెరిగినా అందం తగ్గదు..

చర్మం, పాదాలపై కనిపించే ఈ లక్షణాలు విటమిన్ డి లోపానికి సంకేతమా..

For More Health News

Updated Date - Jul 01 , 2025 | 09:41 AM