Protein Digestion: కాళ్ల వాపు వేధిస్తోందా? మీకీ సమస్య ఉన్నట్టే!
ABN , Publish Date - Jan 27 , 2025 | 10:44 PM
శరీరానికి ప్రొటీన్లు ఎంతో అవసరం. అయితే, ఇవి జీర్ణం కాని పక్షంలో కొన్ని రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. అవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ప్రొటీన్లు, పీచు పదార్థం పుష్కలంగా ఉన్న ఆహారం అత్యుత్తమమైనది. ఈ ఆహారం తింటే రోజుంతా కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. తద్వారా అతిగా తినే సమస్య నుంచి బయటపడతారు. ఈ తరహా ఫుడ్స్ ఆకలికి సంబంధించిన హార్మోన్లను కూడా నియంత్రణలో ఉంచుతుంది. షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉండేలా చేస్తుంది. అయితే, ప్రొటీన్ సరిగా జీర్ణం కాని వ్యక్తుల్లో కొన్ని సమస్యలు కూడా వస్తాయి (Health).
ప్రొటీన్లు సరిగా జీర్ణం కావట్లేదనేందుకు కాళ్లు చేతుల్లో వాపు ఓ ముఖ్య సంకేతం. అయితే, ఈ సమస్యకు ఇతర ప్రమాదకర కారణాలు కూడా ఉండొచ్చు. కాబట్టి, కాళ్లు చేతులు వాస్తున్నాయనగానే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
ప్రొటీన్లు ఉన్న ఆహారం తింటే కడుపు చాలా సేపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే, ప్రొటీన్లు సరిగా జీర్ణం కాని పక్షంలో పదే పదే ఆకలిగా అనిపిస్తుంది. కాబట్టి, ఈ విషయంపై దృష్టి పెట్టాలి (Protein Digestion).
Fatty liver: అలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే ఫ్యాటీ లివర్ ఉన్నట్టు అనుమానించాలి
ప్రొటీన్లు తక్కువగా ఉంటే గాయాలు నయం కావడం ఆలస్యం అవుతుంది. అంతేకాకుండా, కాళ్లు బెణకడం, లేదా పని ప్రదేశాల్లో తరచూ గాయాలపాలవడం వంటివి జరుగుతుంటాయి. ప్రొటీన్ల కొరత కారణంగా శరీరంలో కొల్లాజెన్ తయారీ తగ్గి ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్యులు చెబుతున్నారు.
ఇక శరీరానికి ప్రొటీన్లు సరిగా అందకపోతే నడక తీరులో కూడా మార్పులు వస్తాయి. కాబట్టి, 55 ఏళ్లు పైబడిన వారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రొటీన్ల కొరతతో కండరాలు క్షీణిస్తాయి. జీవక్రియలు కూడా నెమ్మదిస్తాయి. చివరకు రక్తహీనత బారిన కూడా పడతారు.
Tooth pain: పంటి నొప్పితో బాధపడుతున్నారా? ఈ చిన్న ట్రిక్‌తో తక్షణ రిలీఫ్!
ఇక ప్రొటీన్లు సరిగా అందకపోతే భావోద్వేగాల్లో కూడా తీవ్రస్థాయిలో మార్పులు చోటుచేసుకుంటాయి. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే న్యూరోట్రాన్స్‌మిటర్ల తయారీకి ప్రొటీన్లు అవసరం. ప్రొటీన్లు సరిగా అందని పక్షంలో న్యూరోట్రాన్స్‌మిటర్ల తయారీ మందగించి భావోద్వేగాలపై నియంత్రణ తగ్గుతుంది. ఇలాంటి సందర్భాల్లో చివరకు చికాకు, ఆగ్రహం పెరుగుతాయి. కొన్ని సందర్భా్ల్లో డిప్రెషన్ తలెత్తుతుంది. కాబట్టి, శరీరంలో ఈ మార్పులు కనిపించినప్పుడు వెంటనే తగు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేని పక్షంలో సమస్య తీవ్రమైన మరిన్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని హెచ్చరిస్తున్నారు.