Repeatedly Warm water in winter: శీతాకాలంలో అదే పనిగా గోరువెచ్చని నీరు తాగడం మంచిదేనా?
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:02 PM
శీతాకాలంలో చాలా మంది గోరువెచ్చని నీరు తాగడం మంచిదని అంటారు. కానీ, అదే పనిగా గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలంలో చాలా మంది ఆరోగ్యానికి మంచిదని గోరువెచ్చని నీరు తాగుతుంటారు. ఈ సీజన్‌లో గోరు వెచ్చని నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే, కొంత మంది అదే పనిగా గోరువెచ్చని నీరు తాగుతుంటారు. కానీ, అలా అదే పనిగా గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్య నిపుణుల ప్రకారం, తగిన మొత్తంలో గోరువెచ్చని నీరు తాగడం ప్రయోజనకరం, కానీ రోజంతా అదే పనిగా వేడిగా లేదా గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది కడుపు పొరపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పదే పదే వేడి నీరు తాగడం వల్ల ఉష్ణోగ్రతలు కడుపులోని ఆమ్ల సమతుల్యతను మారుస్తాయని, దీనివల్ల ఆమ్లత్వం, గుండెల్లో మంట లేదా అజీర్ణం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లు తాగకండి. కేవలం గోరువెచ్చని నీరు సరిపోతుంది.
ఆరోగ్యానికి మంచిదని గోరువెచ్చని నీరు అదే పనిగా తాగడం కూడా మంచిది కాదు.
మీకు కడుపులో చికాకు లేదా ఆమ్లత్వం ఉంటే, గోరువెచ్చని నీరు తీసుకోవడం పరిమితం చేయండి.
పడుకునే ముందు ఎక్కువ వేడి నీరు తాగకండి.
తిన్న వెంటనే వేడి నీరు తాగడం కూడా మంచిది కాదు. తిన్న అరగంట తర్వాత తగిన మొత్తంలో గోరు వెచ్చని నీరు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Also Read:
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా 10 లక్షలకు పెంపు.. ఎలా అప్లై చేయాలంటే
ఒకే రోజు ముగ్గురికి రోబోటిక్ సర్జరీలు..
For More Latest News