Share News

Protein Shake Side Effects: వ్యాయామం తర్వాత ప్రోటీన్ షేక్ తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి..

ABN , Publish Date - Jan 25 , 2025 | 06:54 AM

చాలా మంది వ్యాయామం తర్వాత ప్రోటీన్ షేక్ తాగుతుంటారు. అయితే, అలా తాగడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Protein Shake Side Effects: వ్యాయామం తర్వాత ప్రోటీన్ షేక్ తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి..
Protein Shake Side Effects

మనలో చాలామంది ఫిట్‌నెస్ పొందడానికి, బరువు తగ్గడానికి జిమ్ లేదా వర్కౌట్స్ చేస్తుంటారు. వ్యాయామం చేసిన తర్వాత కండరాల శక్తి పెరుగుతుందని ప్రోటీన్ షేక్ తాగుతుంటారు. అయితే, వ్యాయామం చేసిన తర్వాత ప్రోటీన్ షేక్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా తాగడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని సూచిస్తున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ప్రోటీన్‌కు మంచి ప్రత్యామ్నాయం కాదు:

సాధారణంగా ప్రోటీన్ పొందడానికి మాంసం, చేపలు, గుడ్డు, పాలు, పప్పులు, సోయాబీన్ తినమని సలహా ఇస్తారు. అయితే ప్రోటీన్ షేక్ ఈ పోషకానికి మంచి ప్రత్యామ్నాయం కాదు. ఎందుకంటే ఇది దాని కూర్పును మారుస్తుంది.

2. పొట్ట సమస్యలు వచ్చే అవకాశం:

ప్రొటీన్ షేక్స్ పొట్టకు మంచిది కాదు. ఎందుకంటే ఇది జీర్ణకోశ సమస్యలను కలిగిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉన్నాయని, ఇది జీర్ణవ్యవస్థను పాడు చేయగలదని అనేక పరిశోధనలలో పేర్కొన్నారు.

3. హానికరమైన మూలకాలను కలిగి ఉండవచ్చు:

కొంతమంది డబ్బు ఆదా చేయడానికి తక్కువ నాణ్యత గల ప్రోటీన్ షేక్‌లను తాగుతారు. అయితే, పాదరసం, ఆర్సెనిక్, కాడ్మియం, సీసం వంటి హానికరమైన పదార్థాలు ఇందులో ఉంటాయి. ఇది అలసట, బలహీనత, తలనొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది.


4. ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది:

వ్యాయామం తర్వాత ప్రోటీన్ పౌడర్ తాగడం వల్ల ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. అందుకే అటువంటి ఉత్పత్తులను తీసుకునే ముందు దానిలోని పదార్థాలను తెలుసుకోండి, అప్పుడే మీరు ప్రమాదాన్ని నివారించవచ్చు.

5. మొటిమలు రావచ్చు:

శరీర బలానికి ప్రొటీన్ తీసుకోవడం అవసరం, ఎందుకంటే అందులో కొత్త కణాలు ఏర్పడి పాత కణాలు పోతుంటాయి. దీని వల్ల ముఖంపై మొటిమలు రావచ్చు. అలాగే ఇందులో ఉండే బయోయాక్టివ్ పెప్టైడ్స్ సెబమ్ ఉత్పత్తిని పెంచుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Updated Date - Jan 25 , 2025 | 06:58 AM