Pomegranate Seeds in Fridge: దానిమ్మ గింజలను ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చా? ఈ విషయం తెలుసుకోండి.!
ABN , Publish Date - Jul 17 , 2025 | 10:30 AM
దానిమ్మ గింజలను ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చా? ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: దానిమ్మ పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ కణాలతో పోరాడడంలో సహాయపడుతుంది. దానిమ్మ పండు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ శరీరానికి మేలు చేస్తాయి. అయితే, చాలా మంది దానిమ్మ విత్తనాలను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. కానీ, దానిమ్మ గింజలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది దానిమ్మ గింజలను ఒక ప్లేట్ లేదా ఓపెన్ బౌల్‌లో ఉంచి ఫ్రిజ్‌లో ఉంచుతారు. అయితే, ఇలా చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ గింజలు ఎండిపోవడమే కాకుండా వాటి రుచి, పోషకాలు పోతాయని అంటున్నారు. మీరు దానిమ్మ గింజలను ఫ్రిజ్‌లో నిల్వ చేయాలనుకుంటే, ముందుగా వాటిని గాలి చొరబడని కంటైనర్‌లో నింపండి. ఈ కంటైనర్‌ను సరిగ్గా మూసి ఫ్రిజ్‌లో ఉంచండి. ఈ విధంగా దానిమ్మ గింజలు 2 నుండి 3 రోజులు తాజాగా ఉంటాయి. ప్రతిసారీ వాటిని ఫ్రిజ్ నుండి తీసిన తర్వాత, తేమ లోపలికి రాకుండా వెంటనే మూసివేయాలని గుర్తుంచుకోండి.
దానిమ్మ గింజలను ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచకూడదని గుర్తుంచుకోండి. ఎందుకంటే దానిలో ఉండే తేమ వాటిలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. విత్తనాలు రంగు కోల్పోవడం లేదా వింత వాసన వస్తాయి. కాబట్టి, గాలి చొరబడని కంటైనర్‌లో వాటిని ఉంచడం మంచిది. అంతేకాకుండా, వీలైనంత తర్వగా వాటిని తినడం మంచిది. లేదంటే వాటి రుచి, పోషకాలు తగ్గిపోతాయి. అప్పుడు తిన్న ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు.
Also Read:
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!
For More Health News