Share News

USA New Corona Variant: అమెరికాలో కొత్త కరోనా వేరియంట్.. సీడీసీ పరీక్షల్లో వెల్లడి

ABN , Publish Date - May 24 , 2025 | 10:47 AM

అమెరికా అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ తాజాగా జరిపిన స్క్రీనింగ్ పరీక్షల్లో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. వివిధ ఎయిర్‌పోర్టు్ల్లో ప్రయాణికుల శాంపిల్స్‌పై పరీక్షలు జరపగా ఈ వేరియంట్ బయటపడింది.

USA New Corona Variant: అమెరికాలో కొత్త కరోనా వేరియంట్.. సీడీసీ పరీక్షల్లో వెల్లడి
NB.1.8.1 COVID variant

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు దీన్ని ఎన్‌బీ 1.8.1గా గుర్తించారు. ఇటీవల చైనాలో కేసుల పెరుగుదలకు ఈ వేరియంట్ కారణమని పేర్కొన్నారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, అంటువ్యాధుల నియంత్రణ సంస్థ సీడీసీ తాజా తనిఖీల్లో ఈ వేరియంట్ ఉనికి బయటపడింది. కాలిఫోర్నియా, వాషింగ్టన్, వర్జీనియా, న్యూయార్క్ సిటీ వంటి చోట్ల సీడీసీ అధికారులు ప్రయాణికులను పరీక్షించారు. ముఖ్యంగా చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, థాయ్‌ల్యాండ్, నెదర్‌ల్యాండ్స్, స్పెయిన్, వియత్నాం, తైవాన్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షించగా ఈ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 22 నుంచి మే 12 మధ్య ప్రయాణికుల శాంపిల్స్‌ను సేకరించారు. అంతేకాకుండా, ఒహాయో, రోడ్ ఐల్యాండ్, హావాయ్ ప్రాంతాల్లో స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఎన్‌బీ 1.8.1 వేరియంట్ కేసులను గుర్తించారు.


ప్రస్తుతం చైనాలో ఈ వేరియంట్ ప్రబలంగా ఉంది. ఇతర ఆసియా దేశాల్లో కూడా వ్యాపిస్తోంది. హాంకాంగ్‌లో ఇటీవల కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గతేడాదితో పోలిస్తే అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, మునుపటి వేరియంట్లతో పోలిస్తే ఎన్.1.8.1 అంత ప్రమాదకరమైనది కాదని హాంకాంగ్ అధికారులు తెలిపారు. అయితే, బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్క వేసుకోవాలని ప్రజలకు సూచించారు. తైవాన్‌లో కూడా కరోనా కారణంగా కేసులు పెరిగాయి. దీంతో, అక్కడి అధికారులు టీకాలు, యాంటీవైరల్ డ్రగ్స్ నిల్వలు అవసరాలకు సరిపడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


అయితే ఎన్‌బీ 1.8.1 వైరస్‌‌కు రోగ నిరోధక వ్యవస్థల నుంచి తప్పించుకునే సామర్థ్యం ఇతర వేరియంట్లకు సమానాంగానే ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయిటే, శరీరంలోని కొన్ని ప్రొటీన్లకు ఇది బలంగా అనుసంధానం అవుతున్న కారణంగా వ్యాప్తి వేగం ఎక్కువగా ఉందని అంటున్నారు.

ఇక అమెరికాలో ఫైజర్, మోడర్నా సంస్థలు ఎల్‌పీ.8.1 వేరియంట్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించిన టీకాలు ఎన్‌బీ1.8.1ను కూడా కొంత వరకూ నిరోధించే అవకాశం ఉన్నట్టు అమెరికా ఔషధ నియంత్రణ మీటింగ్‌లో చర్చకు వచ్చింది. అయితే, రాబోయే నెలల్లో జేఎన్.1ను టార్గెట్ చేసేలా టీకాలు సిద్ధం చేయాలని కూడా ఎఫ్‌డీఏ సూచించినట్టు తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం, అమెరికాలో ప్రస్తుతం ఎక్స్‌‌ఈసీ వేరియంట్ కారణంగా కేసులు పెరుగుతున్నాయి. అయితే, కేసుల పెరుగుదల సీజన్‌ల వారీగా ఉంటోందని అధికారులు తెలిపారు. ఏటా రెండు మార్లు కేసులు పెరిగి తగ్గుతున్నాయని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

బాడీ బిల్డర్స్‌కు హార్ట్ ఎటాక్ ముప్పు ఐదు రెట్లు ఎక్కువ.. అధ్యయనంలో వెల్లడి

40 ఏళ్లు దాటిన పురుషులు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే

Read Latest and Health News

Updated Date - May 24 , 2025 | 11:19 AM