Morning Health Tips: ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగితే అసిడిటీ పెరుగుతుందా?
ABN , Publish Date - Jul 10 , 2025 | 08:03 AM
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగితే అసిడిటీ పెరుగుతుందా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
Morning Health Tips: చాలా మంది ఉదయం నిద్ర లేవగానే టీ తాగుతారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే, ఖాళీ కడుపుతో టీ తాగితే ఏం జరుగుతుంది? ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
టీలో ఉండే కెఫిన్, టానిన్లు కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల అసిడిటీ సమస్య వస్తుంది.
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది.
టీలో ఉండే ఆమ్లం వల్ల ఛాతీలో మంట, గుండెల్లో మంట వంటి సమస్యలు రావచ్చు.
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల పొట్ట ఉబ్బరంగా అనిపించవచ్చు.
టీ ఎక్కువగా తాగితే శరీరానికి ఐరన్ కంటెంట్ అందుకునే సామర్థ్యం తగ్గుతుంది.
కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు.
అందువల్ల, ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగకుండా, అల్పాహారం తిన్న అరగంట తర్వాత టీ తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేదా, టీ బదులుగా గోరువెచ్చని నీరు తాగడం మంచిదని సూచిస్తున్నారు.
Also Read:
జాగ్రత్త.. ఉదయం ఈ 4 అలవాట్లు మీ కాలేయాన్ని దెబ్బ తీస్తాయి..!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు..!
For More Health News