Share News

Moringa Soup Benefits: రష్యా అధ్యక్షుడు మెచ్చిన మునగ సూప్.. ప్రతీ రోజూ తాగితే ఇన్ని లాభాలా?..

ABN , Publish Date - Dec 06 , 2025 | 03:31 PM

భారతదేశంలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు డిన్నర్‌లో భాగంగా మునగ సూప్‌ను కూడా ఇచ్చారు. మునగాకు సూప్‌ను ప్రతీ రోజు ఆహారంగా తీసుకోవటం వల్ల చాలా రకాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Moringa Soup Benefits:  రష్యా అధ్యక్షుడు మెచ్చిన మునగ సూప్.. ప్రతీ రోజూ తాగితే ఇన్ని లాభాలా?..
Moringa Soup Benefits

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పాటు భారత దేశంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు డిన్నర్‌ను ఏర్పాటు చేశారు. డిన్నర్‌లో అత్యంత ఖరీదైన ప్యూర్ వెజ్ వంటకాలను ఆయనకు వడ్డించారు. మునగ సూప్ కూడా పుతిన్ డిన్నర్‌లో భాగమైంది. సాధారణంగా మునగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ప్రతీ రోజూ ఉదయం మునగ ఆకులతో తయారు చేసిన సూప్ తాగితే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆ రోజంతా ఎంతో యాక్టీవ్‌గా ఉండొచ్చు.


మునగ ఆరోగ్య ప్రయోజనాలు..

మునగ ఆకుల్లో విటమిన్ ఏ, సీ, ఈ పుష్కలంగా ఉంటాయి. ప్రతీ రోజూ మునగను ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. మునగలోని మినరల్స్, కాల్షియం, పొటాషియం ఎముకలను దృఢంగా చేస్తాయి. మునగలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మునగలోని ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కెఫైన్ లేకుండా శరీరానికి శక్తిని ఇచ్చే గొప్ప గుణం మునగకు ఉంది. ప్రతీ రోజూ మునగను ఆహారంగా తీసుకునే వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.


సులభంగా మునగాకు సూప్ తయారు చేసుకోవటం ఎలా?...

  • ఓ కప్పు నిండా తాజా మునగాకును తీసుకోండి. వాటిని బాగా శుభ్రం చేయండి.

  • అవి మెత్తగా అయ్యే వరకు వేడి నీటిలో వేసి మరగబెట్టండి.

  • ఓ కడాయ్‌లో నూనె వేసి వేడి చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో వేయించండి. అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాలి.

  • నీటితో సహా మునగాకును ఆ కడాయ్‌లో వేయండి. కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, మిరియాల పొడి వేసి కొద్దిసేపు మరిగించండి.

  • తర్వాత వాటిని మొత్తగా అయ్యే వరకు మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత మళ్లీ పెనంలో వేసి మరిగించాలి.

  • ఈ సారి కొబ్బరిపాలు, నిమ్మకాయ రసం కలిపి కొద్దిసేపు మరిగిస్తే మునగ సూప్ రెడీ అవుతుంది.


ఇవి కూడా చదవండి

అల్లం వెల్లుల్లి పేస్ట్‌.. ఎక్కువ కాలం ఇలా నిల్వ చేయండి..

ప్రపంచ దేశాలతో భారత్ బంధాలను ఎవరూ వీటో చేయలేరు: జైశంకర్

Updated Date - Dec 06 , 2025 | 03:38 PM