Share News

Vitamin D Deficiency Causes: సప్లిమెంట్స్ తీసుకున్నా విటమిన్ డీ లోపమా.. కారణాలు ఇవే..

ABN , Publish Date - Mar 03 , 2025 | 10:24 PM

సప్లిమెంట్స్ తీసుకున్న తరువాత కూడా విటమిన్ డీ లోపం తలెత్తుతోందంటే ఇతర అనారోగ్య కారణాలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Vitamin D Deficiency Causes: సప్లిమెంట్స్ తీసుకున్నా విటమిన్ డీ లోపమా.. కారణాలు ఇవే..
Vitamin D Deficiency Causes

ఇంటర్నెట్ డెస్క్: శరీరానికి తగినంత విటమిన్ డీ అందించేందుకు సూర్యరశ్మికి మించినది లేదు. అయితే, సూర్యరశ్మి తగినంతగా లేనప్పుడు లేదా ఆహారం ద్వారా అందే విటమిన్ డీ సరిపోనప్పుడు సప్లిమెంట్స్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, సప్లిమెంట్స్ తీసుకుంటున్నా విటమిన్ డీ లోపం ఉంటే అంతర్గతంగా సమస్య ఉందని భావించాల్సిందే (Vitamin D Deficiency Causes).

వైద్యులు చెప్పే దాని ప్రకారం, పేగుల్లో సమస్యలు, ఊబకాయం, కిడ్నీ వ్యాధులు, లివర్ సంబంధిత సమస్యలన్నీ శరీరానికి తగినంత విటమిన్ డీ అందకుండా అడ్డుపడతాయి.


Coconut water High Potassium: కొబ్బరి నీళ్లతో ఇలాంటి రిస్కులు కూడా ఉంటాయి జాగ్రత్త!

‘‘పేగులు ఏ మేరకు ఆహారంలోని కొవ్వులు గ్రహించగలుగుతున్నాయనే అంశంపై విటమిడీ అబ్సార్సషన్ కూడా ఆధారపడి ఉంటుంది. లివర్ సమస్యలు, సిస్టిక్ ఫైబ్రోసిస్, సీలియాక్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్ వంటివన్నీ శరీరం విటమిన్ డీని పూర్తిస్థాయిలో గ్రహించకుండా అడ్డుపడతాయి’’ అని వైద్యులు చెబుతున్నారు. ‘‘విటమిన్ డీ పూర్తిస్థాయిలో శరీరంలోకి చేరాలంటే కొవ్వులు కూడా ఆ మేరకు శరీరం గ్రహించగలగాలి. కానీ చాలా మంది పరగడుపున ఈ సప్లిమెంట్స్‌ను తీసుకుంటూ ఉంటారు. దీంతో, వాటి ప్రభావం తగ్గిపోతుంది’’ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలోకు రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా

పేగులు కొవ్వులను సరిగా గ్రహించలేని కారణంగా విటమిన్ డీ తలెత్తుతోందని అనుమానం కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అయితే, సొంత వైద్యానికి దిగితే మాత్రం మరింత చిక్కుల్లో పడొచ్చు. కొందరు తప్పుడు విటమిన్ డీ సప్లిమెంట్లను కూడా తీసుకుంటూ ఉంటారు. వైద్యుల సలహా లేకుండా సొంత వైద్యానికి దిగినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇక వృద్ధుల్లో విటమిన్ డీ లోపం తలెత్తే అవకావాలు ఎక్కువ. పెద్దవయసు వారిలో చర్మం కావాల్సిన మొత్తంలో విటమిన్ డీ తయారు చేయలేకపోవడమే ఇందుకు కారణం. కాబట్టి, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సమస్య ముదరకుండా నివారించొచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం అరగంటపాటైనా ఒంటిపై ఎండపడేలా జాగ్రత్త తీసుకుంటే విటమిన్ డీ లోపాన్ని చాలా వరకూ నిరోధించొచ్చని చెబుతున్నారు.

Read Latest and Health News

Updated Date - Mar 03 , 2025 | 10:24 PM