Causes of Kidney Stones: రోజువారీ అలవాట్లే కిడ్నీలో రాళ్లకు కారణమా?
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:20 PM
రోజువారీ అలవాట్లే కిడ్నీలో రాళ్లకు కారణమవుతాయా? కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి? వాటిని ఎలా నివారించాలి? అనే విషయాలను ఆరోగ్య నిపుణుల నుండి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతుంటారు. కిడ్నీలో రాళ్లు అంటే మూత్రపిండాల లోపల పేరుకుపోయిన ఖనిజాలు చిన్నవిగా స్ఫటికాలను ఏర్పరుస్తాయి. ఈ స్ఫటికాలు మొదట్లో చిన్నవిగా ఉంటాయి కానీ కాలక్రమేణా అవి పెద్ద రాళ్లను ఏర్పరుస్తాయి. అయితే, రోజువారీ అలవాట్లే కిడ్నీలో రాళ్లకు కారణమవుతాయా? వాటిని ఎలా నివారించాలి? అనే విషయాలను ఆరోగ్య నిపుణుల నుండి ఇప్పుడు తెలుసుకుందాం..
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణాలు ప్రతి రోజు తగినంత నీరు తాగకపోవడం, కొన్ని రకాల ఆహారాలు సోడియం, చక్కెర, మాంసం అధికంగా ఉన్నవి తీసుకోవడం, కొన్ని జీవనశైలి అలవాట్లు, అధిక బరువు కలిగి ఉండటం, కొన్ని జన్యుపరమైన కారణాలు లేదా కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
కిడ్నీలో రాళ్ల వల్ల మూత్ర విసర్జనలో నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. ఈ రాళ్లు మూత్ర ప్రవాహాన్ని అడ్డుకోవచ్చు. దీనివల్ల కిడ్నీ దెబ్బతినడం, ఇన్ఫెక్షన్లు వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు. చిన్నగా ఉన్న రాళ్లను నీరు ఎక్కువగా తాగడం, వ్యాయామం చేయడం ద్వారా కిడ్నీలో నుంచి బయటకు పంపవచ్చు. కానీ, పెద్ద రాళ్లకు వైద్య చికిత్స అవసరం కావచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రోజూ 8 నుండి 9 గ్లాసుల నీరు తాగండి. నిమ్మరసం వంటి పండ్ల రసాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అలాగే, సోడియం తీసుకోవడం తగ్గించండి. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు తగ్గించడం వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది.
మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు
ఆక్సలేట్‌లు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. టొమాటోలు, కాలీఫ్లవర్, నట్స్ వంటి ఆక్సలేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాలను తగ్గించండి.
అధిక బరువు కిడ్నీలో రాళ్లకు ఒక కారణం, కాబట్టి బరువు నియంత్రణలో ఉంచుకోండి.
Also Read:
జుట్టు రాలడం తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?
డ్రాగన్ ఫ్రూట్.. ఈ సమస్యలు ఉన్నవారికి మంచిది.!
For More Latest News