Share News

International Yoga Day 2025: మీ ఫిట్‌నెస్ చెక్కుచెదరకుండా ఉండాలంటే..కుర్చీపై కూర్చొని..

ABN , Publish Date - Jun 20 , 2025 | 03:09 PM

మీకు వ్యాయామం చేయడానికి టైం లేదా? జాబ్ అంటూ ఎక్కువ సేపు కుర్చీలో కూర్చొని ఉంటున్నారా? అయితే, మీ ఫిట్‌నెస్ చెక్కుచెదరకుండా ఉండాలంటే..

International Yoga Day 2025: మీ ఫిట్‌నెస్ చెక్కుచెదరకుండా ఉండాలంటే..కుర్చీపై కూర్చొని..
International Yoga Day 2025

International Yoga Day 2025: యోగాసనాలు ఆరోగ్యానికి చాలా మంచివి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడిని తగ్గించి, శ్రేయస్సును పెంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తపోటును తగ్గించడానికి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న యోగాని చేయడానికి కొంత మంది తమకు సమయం ఉండదని అంటారు. జాబ్ అంటూ ఎక్కువ సేపు కుర్చీలో కూర్చొని ఉండాల్సి వస్తుందని అంటారు. అయితే, ఇలాంటి వారు తమ ఫిట్‌నెస్ చెక్కుచెదరకుండా ఉండటం కోసం కుర్చీపై కూర్చొని చేసే యోగాసనాలు చేస్తే సరిపోతుంది. 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, మీరు కుర్చీపై కూర్చున్నా చాలా సులభంగా చేయగలిగే కొన్ని సులభమైన యోగాసనాల గురించి తెలుసుకుందాం.. మీరు ఏదైనా వైద్యపరమైన సమస్యలతో బాధపడుతుంటే ఈ వ్యాయామం చేయడానికి ముందు వైద్యుడిని సంప్రదించండి.


మెడను వృత్తాకారంగా..

మీరు ఎక్కువసేపు కుర్చీలో కూర్చుంటే, ముందుగా మెడ వ్యాయామాలు చేయండి. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు మీ మెడను అప్పుడప్పుడు వృత్తాకారంగా కదిలించడం మంచిది. అంటే మెడను గుండ్రంగా తిప్పాలి. ఈ వ్యాయామం మీ మెడలో కలిగే దృఢత్వాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది.

Yoga.jpg


బిటిలాసన చైర్ పోజ్

బిటిలాసన చైర్ పోజ్‌ను మర్జారి ఆసనం అని కూడా అంటారు. ఈ ఆసనాన్ని చేయడానికి, ముందుగా ఒక కుర్చీపై నిటారుగా కూర్చుని, రెండు పాదాలను నేలపై ఉంచి, మీ వెన్నెముకను నిటారుగా ఉంచండి. ఇప్పుడు రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచి, దీర్ఘంగా శ్వాస తీసుకుని, ఛాతీని బయటికి చాచండి. ఇప్పుడు భుజాలను వెనుకకు కదిలించండి. నెమ్మదిగా గాలి వదులుతూ, వెన్నెముకను వెనుక వైపుకు వంచండి. ఈ ఆసనాన్ని కనీసం ఐదు సార్లు చేయండి.

Chair Yoga.jpg


అర్ధ మత్స్యేంద్రాసన

అర్ధ మత్స్యేంద్రాసన అనేది కూర్చుని చేసే ఒక యోగా భంగిమ. ఈ ఆసనం వెన్నెముకను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది వెన్నెముక సమస్యలు ఉన్నవారికి ఉపయోగపడుతుంది. శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.  కుర్చీపై నేరుగా కూర్చుని, గాలి పీల్చుకుని రెండు చేతులను పైకి కదిలించండి. కొంతసేపు ఈ స్థితిలో ఉన్న తర్వాత, గాలి వదులుతూ చేతులను క్రిందికి తీసుకురండి. ఈ యోగాను 10 నుండి 15 సార్లు చేయండి.

chair Yoga 1.jpg


(NOTE: ఆరోగ్య నిపుణుల ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

శరీరంలో టెంపరేచర్‌కు ఓ లిమిట్.. ఈ లక్ష్మణ రేఖ దాటితే..

ఈ వ్యాధులు ఉన్నవారు బెండకాయ తింటే.. ఇక అంతే..

For More Health News

Updated Date - Jun 20 , 2025 | 05:15 PM