Lady Finger: ఈ వ్యాధులు ఉన్నవారు బెండకాయ తింటే.. ఇక అంతే..
ABN , Publish Date - Jun 20 , 2025 | 01:39 PM
ఈ వ్యాధులు ఉన్నవారు బెండకాయ తింటే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ సమస్యలు ఉన్నవారు బెండకాయ తినకూడదు? ఎందుకు తినకూడదు ? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Lady Finger: బెండకాయ అనేది ఒక కూరగాయ. సాధారణంగా వీటిని లేడీస్ ఫింగర్ అని కూడా పిలుస్తారు. దీంట్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బెండకాయను వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. కొందరు వేయించి కూరగా చేసుకోని తింటారు. మరికొందరు సాంబార్‌లలో కూడా ఉపయోగిస్తారు. బెండకాయలో విటమిన్ సి, విటమిన్ కె, మెగ్నీషియం, ఫోలేట్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. దీనిలో ఉంటే యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు.. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షిస్తాయి. అయితే, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బెండకాయను ఈ వ్యాధులు ఉన్నవారు తింటే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ సమస్యలు ఉన్నవారు బెండకాయ తినకూడదు? ఎందుకు తినకూడదు ? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
గ్యాస్, ఉబ్బరం
మీ జీర్ణవ్యవస్థ ఇప్పటికే బలహీనంగా ఉంటే బెండకాయ తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, లేడీస్ ఫింగర్‌లో ఉండే అధిక ఫైబర్.. గ్యాస్, ఉబ్బరం సమస్యలను పెంచుతుంది. అంతేకాకుండా, వీటిని అధికంగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఆమ్లత్వం వంటి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి, మీకు ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉంటే ఎట్టిపరిస్థితిలోనూ బెండకాయ తినకండి.
కిడ్నీ సమస్యలు
మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు కూడా బెండకాయ తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల మూత్రపిండాలలో రాళ్ల సమస్య మరింత పెరుగుతుందని అంటున్నారు. బెండకాయలోని ఆక్సలేట్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుందని, ఇది రాళ్ల సమస్యను పెంచుతుందని చెబుతున్నారు. కాబట్టి, కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే బెండకాయ తినాలని సూచిస్తున్నారు.
జలుబు, దగ్గు
బెండకాయ జలుబు, దగ్గు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మీరు ఇప్పటికే జలుబు లేదా సైనస్‌తో బాధపడుతుంటే పొరపాటున కూడా వీటిని తీసుకోకండి. ఎందుకంటే బెండకాయ.. జలుబు, దగ్గు సమస్యను మరింత పెంచుతుంది.
అధిక రక్తపోటు
అధిక రక్తపోటు ఉన్నవారు కూడా బెండకాయ తినడం మంచిది కాదు. ఎందుకంటే దీనిలోని అధిక పొటాషియం.. రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, వీటిని ఎట్టిపరిస్థితిలోనూ తీసుకోకండి.
అలెర్జీ సమస్యలు
కొంతమందికి బెండకాయ తింటే అలెర్జీ వస్తుంది. చర్మంపై దద్దుర్లు, దురద, ఇతర అలెర్జీ సమస్యలు వస్తాయి. కాబట్టి, బెండకాయ అంటే అలెర్జీ ఉన్నవారు వీటిని తినకుండా ఉండటం మంచిది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఖాళీ కడుపుతో నేరేడు విత్తనాల పొడి తీసుకుంటే.. ఈ 5 సమస్యలు దూరం..!
For More Health News