Share News

Insulin Resistance: ఇన్సులిన్ నిరోధకతతో బాధపడుతున్నారా.. ఖాళీ కడుపుతో వీటిని తినండి..

ABN , Publish Date - May 30 , 2025 | 02:50 PM

చాలా మంది ఇన్సులిన్ నిరోధకత సమస్యతో బాధపడుతుంటారు. ఇన్సులిన్ నిరోధకత అనేది మీ కణాలు ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించలేకపోవడం. దీని వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి, వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.

Insulin Resistance: ఇన్సులిన్ నిరోధకతతో బాధపడుతున్నారా.. ఖాళీ కడుపుతో వీటిని తినండి..
Insulin Resistance

ఇన్సులిన్ అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే హార్మోన్. ఇది గ్లూకోజ్‌ను కణాలకు తీసుకువెళ్లి, వాటిని శక్తిగా ఉపయోగించడానికి సహాయపడుతుంది. అయితే, ఇన్సులిన్ నిరోధకత ఉన్నప్పుడు కణాలు ఇన్సులిన్‌కు స్పందించవు. మీ కణాలు ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించకపోతే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. మీరు కూడా ఇన్సులిన్ నిరోధకతతో బాధపడుతున్నట్లయితే ఖాళీ కడుపుతో ఈ 5 ఆహార పదార్ధాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


నానబెట్టిన బాదం పప్పులు

బాదం పప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి, ఉదయాన్నే వీటిని తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 3 నుంచి 5 బాదం పప్పులను రాత్రి సమయంలో నానబెట్టి, ఉదయం తింటే ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుందన్నారు.

మొలకెత్తిన గింజలు

మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B, విటమిన్ C, విటమిన్ K వంటివి సమృద్ధిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల సహజంగా చక్కెర నియంత్రణలో ఉంటుంది.

మెంతుల టీ

మెంతుల టీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఈ టీ తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఉసిరికాయ రసం

ఉసిరికాయలతో తయారుచేసిన రసాన్ని తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయని అంటున్నారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

దాల్చిన చెక్క నీరు

దాల్చిన చెక్క నీరు ఒక ఆరోగ్యకరమైన పానీయం. ఇది వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడటమే కాకుండా షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

ప్రతి మహిళ తప్పక చేయించుకోవాల్సిన 8 ఆరోగ్య పరీక్షలు..

మహిళల్లో పెరుగుతోన్న క్యాన్సర్ ప్రమాదం..

For More Health News

Updated Date - May 30 , 2025 | 05:34 PM