Share News

Nail Polish Side Effects: నెయిల్ పాలిష్ వాడుతున్నారా? అయితే మీ ఆరోగ్యం డేంజర్లో ఉన్నట్లే..

ABN , Publish Date - Aug 11 , 2025 | 01:50 PM

Nail Polish Side Effects: నేడు చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలివాళ్ల వరకు నెయిల్ పాలిష్ వాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెయిల్ పాలిష్ వాడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది.

Nail Polish Side Effects: నెయిల్ పాలిష్ వాడుతున్నారా? అయితే మీ ఆరోగ్యం డేంజర్లో ఉన్నట్లే..
Nail Polish Side Effects

ఆడవాళ్లు తమ చేతి వేళ్ల గోళ్లు అందంగా కనిపించడానికి నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటారు. నేడు చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలివాళ్ల వరకు నెయిల్ పాలిష్ వాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెయిల్ పాలిష్ వాడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అయితే, నెయిల్ పాలిష్ కారణంగా చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నెయిల్ పాలిష్‌లోని కొన్ని రకాల రసాయనాలు మన ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది. నెయిల్ పాలిష్ వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


అలర్జీలు

నెయిల్ పాలిష్ అందరికీ సెట్ అవ్వదు. కొంతమందిలో అలర్జిక్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. నెయిల్ పాలిష్ రాసుకున్న తర్వాత గోళ్ల దగ్గర చర్మం ఎర్రగా మారటం, దురద, ఆ ప్రాంతం ఉబ్బటం, ఎగ్జిమా వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని సార్లు అలర్జీలు గోళ్ల ద్వారా ఇతర శరీర భాగాలకు పాకే అవకాశం కూడా ఉంది.

గోళ్లు పొలుసుగా మారటం

తరచుగా నెయిల్ పాలిష్, నెయిల్ పాలిష్ రిమూవర్లు వాడటం వల్ల గోళ్లు పొడిబారిపోయే అవకాశం ఉంది. తద్వారా గోళ్లు సులభంగా విరిగిపోవటం, పూర్తిగా ఊడి రావటం వంటివి జరగొచ్చు.


డీఎన్‌ఏ డ్యామేజ్

జెల్ మానిక్యూర్స్ క్యూరింగ్ చేయడానికి యూవీ లేదా ఎల్‌ఈడీ ల్యాంప్స్‌ను వాడతారు. ఈ సమయంలో శరీరం యూవీ రేడియేషన్‌కు గురి అవుతుంది. యూవీ కిరణాల కారణంగా చర్మం త్వరగా ముడతలు పడుతుంది. డీఎన్‌ఏ కూడా పాడవుతుంది. స్కిన్ క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంది.

శ్వాస కోశ సంబంధ సమస్యలు

నెయిల్ పాలిష్‌లోని కొన్ని రసాయనాలు.. ముఖ్యంగా ఫార్మాల్డిహైడ్ వల్ల శ్వాస కోశ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దగ్గు, పిల్లి కూతలు, ఆస్తమా లాంటి పరిస్థితి(ఆస్తమా కాదు) తలెత్తే అవకాశం ఉంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


ఇవి కూడా చదవండి

పిల్లాడితో కాళ్లకు మసాజ్.. అడ్డంగా దొరికి పోయిన టీచరమ్మ..

వామ్మో.. నీతా అంబానీ కారు.. ఖరీదెంతో తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..

Updated Date - Aug 11 , 2025 | 02:00 PM