Share News

Nanoinjection Platform: క్యాన్సర్ రోగులకు శుభవార్త.. అందుబాటులోకి అద్భుతమైన నానోఇంజెక్షన్

ABN , Publish Date - Dec 22 , 2025 | 05:28 PM

క్యాన్సర్ రోగులకు ఐఐటీ మద్రాస్ గుడ్ న్యూస్ చెప్పింది. బ్రీస్ట్ క్యాన్సర్ నివారణ కోసం ‘కట్టింగ్ ఎడ్జ్ నానోఇంజెక్షన్ డ్రగ్ డెలివరీ ప్లాట్ ఫామ్’ను అభివృద్ది చేసింది. ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ కట్టింగ్ ఎడ్జ్ నానోఇంజెక్షన్ పద్దతిని అభివృద్ధి చేసింది.

Nanoinjection Platform: క్యాన్సర్ రోగులకు శుభవార్త.. అందుబాటులోకి అద్భుతమైన నానోఇంజెక్షన్
Nanoinjection Platform

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళల్ని బలి తీసుకుంటున్న రోగాల్లో క్యాన్సర్ ముందు వరుసలో ఉంది. ప్రతీ ఏటా కొన్ని వేల మంది ఆడవారు బ్రీస్ట్ క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నప్పకీ.. క్యాన్సర్ దశలపై నివారణ ఆధారపడి ఉంటుంది. మొదటి దశలో ఉంటే చికిత్సలు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తాయి. తర్వాతి దశల్లో నివారణ కష్టం అవుతుంది. బ్రీస్ట్ క్యాన్సర్ చివరి దశలో ఉన్న మహిళలు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో ఐఐటీ మద్రాస్ గుడ్ న్యూస్ చెప్పింది. బ్రీస్ట్ క్యాన్సర్ నివారణ కోసం ‘కట్టింగ్ ఎడ్జ్ నానోఇంజెక్షన్ డ్రగ్ డెలివరీ ప్లాట్ ఫామ్’ను అభివృద్ది చేసింది.


ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ కట్టింగ్ ఎడ్జ్ నానోఇంజెక్షన్ పద్దతిని అభివృద్ధి చేసింది. ఈ పద్దతి ద్వారా బ్రీస్ట్ క్యాన్సర్ చికిత్స అత్యంత సురక్షితంగా, ప్రభావవంతంగా మారనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కీమోథెరపీ, రేడియేషన్ పద్దతుల కారణంగా క్యాన్సర్ కణాలు కాని వాటిపై కూడా ప్రభావం పడుతోంది. సిస్టమేటిక్ డ్రగ్ ఎక్స్‌పోజర్ కారణంగా ఇలా జరుగుతోంది. కట్టింగ్ ఎడ్జ్ నానోఇంజెక్షన్ పద్దతి ద్వారా యాంటీ క్యాన్సర్ డ్రగ్ అయిన డోక్సోరుబిసిన్‌ను నేరుగా క్యాన్సర్ కణాల్లోకి ఇంజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సెల్ కల్చర్, కోడి పిండాలపై ప్రయోగాలు జరిగాయి.


ఈ ప్రయోగాలకు సంబంధించిన వివరాలు అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ ఇంటర్‌ఫేసెస్ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి. ఆ జర్నల్‌లో ఏముందంటే.. నానో ఆర్కియోజోమ్ డోక్సోరుబిసిన్ సిలికాన్ న్యానోట్యూబ్స్.. ఎమ్‌సీఎఫ్ 7 బ్రీస్ట్ క్యాన్సర్ కణాలపై ప్రభావవంతంగా పని చేశాయి. క్యాన్సర్ లేని కణాలను సురక్షితంగా ఉంచాయి. ఈ కొత్త పద్దతిలో మందు ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది. సాధారణంగా ఉపయోగించే డోక్సోరుబిసిన్ మందుతో పోలిస్తే, ఇది 23 రెట్లు తక్కువ మోతాదులోనే క్యాన్సర్ కణాలను అదుపులోకి తీసుకొచ్చింది. అంటే, తక్కువ మోతాదులోనే ఎక్కువ పని చేయగలదన్న మాట. దీని వల్ల చికిత్స ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది, అలాగే రోగులకు వచ్చే దుష్ప్రభావాలు కూడా తక్కువగా ఉంటాయి.


ఇవి కూడా చదవండి

దశాబ్దాల నిరీక్షణ తర్వాత.. కలల ‘కప్పు’ దరి చేరిన వేళ!

కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం

Updated Date - Dec 22 , 2025 | 05:32 PM