Ideal gym workout duration: జిమ్‌లో రోజూ ఎంత సేపు ఎక్సర్‌సైజులు చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయంటే..
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:50 PM
జిమ్‌లో ఓ పరిమితికి మించి కసరత్తులు చేస్తే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ ఉపయుక్తమైన సమయం ఉందని చెబుతున్నారు. మరి ఈ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: ఫిట్‌గా ఉండటం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి లక్ష్యంగా మారింది. ముఖ్యంగా యువత అందమైన శరీరాకృతి కోసం జిమ్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. గంటల కొద్దీ కఠిన ఎక్సర్‌సైజులు చేస్తూ గడిపేస్తున్నారు. అయితే, ఈ విషయమై అనేక మంది శాస్త్రీయ దృక్పథం కొరవడింది. రకరకాల అపోహలు, అర్ధ సమాచారంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. అయితే, జిమ్‌లో ఎంత సేపు కసరత్తు చేయాలి, ఏయే తరహా ఎక్సర్‌సైజులు చేయాలి. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో నిపుణులు అనేక సూచనలు చేస్తున్నారు. వాటిని తూచా తప్పకుండా పాటిస్తే ఎటువంటి ప్రమాదాలు లేకుండా కావాల్సిన శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చు (Ideal Gym Workout Duration).
Hair Dye - Side Effects: రెగ్యులర్‌గా హెయిర్ డై వేసుకునే వారు తెలియక చేసే తప్పు ఏంటంటే..
నిపుణులు చెప్పే దాని ప్రకారం, జిమ్‌లో కసరత్తులు చేసే ముందు కచ్చితంగా వార్మప్ చేసుకోవాలి. అంటే.. కసరత్తుల కోసం శరీరాన్ని ముందుగా ఉత్తేజితం చేయాలి. వార్మప్‌తో గాయాల బారిన పడే ప్రమాదం తప్పుతుంది. కసరత్తుల ప్రభావం కూడా పెరుగుతుది.
జిమ్‌లో కనీసం 45 నిమిషాల నుంచి గంట పాటు కసరత్తులు చేస్తే గొప్ప ఫలితాలు ఉంటాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఇంతకు తక్కువగా చేస్తే ఆశించని ప్రయోజనం రాదని చెబుతున్నారు. గంటకు మించి కఠినమైన ఎక్సర్ సైజులు చేస్తే మాత్రం ఎముకలు, కండరాలు బలహీన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
Death due Extreme Dieting: బరువు తగ్గేందుకు కఠిన డైటింగ్.. టీనేజర్ దుర్మరణం
ఇక నిపుణుల పర్యవేక్షణలోనే జిమ్‌లో కసరత్తులు చేయాలి. లేకపోతే ఎక్సర్‌సైజులు ప్రభావం ఆశించిన మేరకు ఉండకపోగా గాయాల పాలయ్యే ప్రమాదం ఉంది.
ఇక కొందరు త్వరగా కండలు పెంచాలనే ధోరణిలో అడ్డదారులు తొక్కుతుంటారు. వేగంగా కండలు పెరిగేందుకు స్టెరాయిడ్ తీసుకునేందుకు వెనకాడరు. కానీ, స్టెరాయిడ్ వినియోగం వల్ల గుండె, లివర్, కిడ్నీలు వంటి అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి, ఫిట్‌నెస్ కోసం జిమ్‌కు వెళ్లేవారు నిపుణుల పర్యవేక్షణలో కసరత్తులు చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి.