Holi - Water Borne Infections: హోలీ పండగ ఎంజాయ్ చేస్తున్నారా.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇదే
ABN , Publish Date - Mar 14 , 2025 | 08:31 AM
హోలీ సమయంలో నీటి పరిశుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. రకరకాల బ్యాక్టీరియా వైరల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: దేశమంతటా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రంగుల జల్లుల్లో జనాలు తడిసి ముద్దవుతున్నారు. స్నేహితులు, బంధువుల నడుమ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, సంబరాల్లో పడి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ పండగతో అనవసర సమస్యలు వచ్చి పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హోలీ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందాం (Holi Celebrations precautions).
హోలీ సందర్భంగా కలుషితమైన నీరు వాడితే రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
కలుషిత నీటి కారణంగా ఈకొలై, సాల్మొనెల్ల వంటి హానికారక బ్యాక్టీరియా బారిన పడి డయేరియా, డిసెంట్రీ, డీహైడ్రేషన్ వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది.
టైఫాయిడ్.. కలుషితమైన నీటిలోని సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియాతో టైఫాయిడ్ బారిన పడే ప్రమాదం. టైఫాయిడ్ వచ్చిన వారిలో తీవ్రమైన జ్వరం, బలహీనత, జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి.
కలుషిత నీటి కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. లివర్ ఇన్‌ఫ్లమేషన్, జాండిస్, ఇతర జీర్ణ వ్యవస్థ సంబంధి సమస్యల బారిన పడొచ్చు.
జంతు వ్యర్థాలతో కలుషితమైన జలాలతో లెప్టోస్పైరోసిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి బారిన పడ్డ వారిలో జ్వరం, వణుకు, కండరా నొప్పులు కనిపిస్తాయి
ఇక కృత్రిమ రంగుల కారణంగా కంట్లో దురద, ఎర్రబడటం, చర్మంపై రాషెస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది
ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హోలీ రంగులు కలిపేందుకు పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి. వీలైనంత వరకూ తాజా నీటిని వాడితే ఇన్‌ఫెక్షన్ల అవకాశం తగ్గుతుంది.
హానికారక రసాయనాలు ఉండే కృత్రిమ రంగులకు బదులు సహజసిద్ధమైనవి వాడితే కళ్లు, చర్మ సంబంధిత సమస్యలు దరిచేరవు.
Holi celebrations: ఘనంగా హోలీ సంబురాలు.. పోలీసుల ఆంక్షలు
రంగులు వేసేటప్పుడు అవి నేరుగా కళ్లు, నోట్లోకి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి
డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు తగినంత నీరు తాగాలి. చేతులు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి.
హోలీ తరువాత తలారా స్నానం చేయాలి. హోలీకి ముందు పెరుగు, యోగర్ట్ లాంటి వాటిని తీసుకుంటనే పేగుల ఆరోగ్యం మరింత మెరుగవుతుంది.
వాటర్ బెలూన్లు అస్సలు వాడకూడదు. వీటి వల్ల బ్యాక్టీరియా, వైరస్ వ్యాపి మరింత అధికమవుతుంది.