Healthy Sleep Habits: రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఆ వ్యాధులు మాయం..
ABN , Publish Date - Feb 03 , 2025 | 01:13 PM
చాలా మంది రాత్రి సమయంలో నిద్ర పట్టక సతమతమవుతుంటారు. అయితే, పడుకునే ముందు చేతులు, కాళ్ళు శుభ్రం చేసుకుంటే నాణ్యమైన నిద్ర పడుతుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి బోలేడు ప్రయోజనాలు ఉంటాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రోజూ పడుకునే ముందు ముఖం, చేతులు, కాళ్లు కడుక్కుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అంటువ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు మీ చేతులు, కాళ్ళు కడుక్కోవడం వలన జలుబు, దగ్గు, ఫ్లూ వంటి అనేక వ్యాధులను నివారించవచ్చు. ఇలా చేయడం వల్ల చాలా వరకు అంటు వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అంతేకాకుండా మీకు నాణ్యమైన నిద్ర కూడా పడుతుంది.
చర్మ సమస్యలు: చేతులు, కాళ్ళు కడుక్కోవడం వల్ల తామర, దద్దుర్లు, దురద వంటి చర్మ సమస్యల నుండి మిమ్మల్ని రక్షించుకోవచ్చు. కాళ్లు చేతులు కడుక్కోకపోవడం వల్ల కూడా రకరకాల అలర్జీలు వస్తాయి. ఇది చర్మ అలెర్జీలకు దారి తీస్తుంది. కాబట్టి నిద్రపోయే ముందు చేతులు, కాళ్లు కడుక్కుంటే అలర్జీలు రాకుండా ఉంటాయి.
నిద్ర నాణ్యతలో మెరుగుదల: రాత్రి పడుకునే ముందు చేతులు, కాళ్ళు కడుక్కుంటే మంచి నిద్ర వస్తుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. దీంతో మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది.
ఆరోగ్యం: నిద్రవేళకు కనీసం 15 నిమిషాల ముందు మీ చేతులు, కాళ్ళు కడగడానికి ప్రయత్నించండి. ఇది మీ శరీరంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగిస్తుంది, అంతేకాకుండా మీరు బాగా నిద్రపోయేలా చేస్తుంది.
భోజనం తర్వాత తినే అలవాటు గురించి జాగ్రత్త: మీకు భోజనం తర్వాత మళ్లీ ఏదైన తినే అలవాటు ఉంటే, జాగ్రత్తగా ఉండండి. ఇది జీర్ణక్రియ, గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది.
చేతులు, కాళ్ళు కడుక్కోవడానికి పద్ధతులు:
మీ చేతులు, కాళ్ళు కడగడానికి సబ్బు, నీటిని ఉపయోగించండి. తర్వాత చేతులు, కాళ్ళను శుభ్రం చేసుకుని ఆరబెట్టుకోండి తర్వాత వాటిని శుభ్రంగా ఉంచండి.
Also Read: నిద్ర లేవగానే ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి చూసినా.. రోజులో ఏ పని విజయవంతం కాదు..