Share News

Health: మాంసంపై నిమ్మరసం ఎందుకు పిండుతారో తెలుసా..

ABN , Publish Date - Jan 18 , 2025 | 06:45 PM

మాంసాహార ప్రియులు ఎక్కువగా నాన్ వెజ్ తినేటప్పుడు నిమ్మకాయను పిండుతారు. అయితే, అలా నిమ్మకాయను పిండడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా? అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Health: మాంసంపై నిమ్మరసం ఎందుకు పిండుతారో తెలుసా..
Non Veg and Lemon

వెజ్ తినేవారి కంటే నాన్ వెజ్ తినే వారే ఎక్కువ. సాధారణంగా నాన్ వెజ్ తినేటప్పుడు చాలా మంది నిమ్మకాయలను పిండుకుని తింటారు. అయితే మాంసాహారంలో నిమ్మకాయను పిండడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా? ఇలా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రత్యేక రుచి..

మాంసాహారం తీసుకోని వారు మాంసంపై నిమ్మకాయను పిండడం సహజం. నిమ్మరసం మాంసానికి ప్రత్యేక రుచిని ఇస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నిమ్మకాయలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మాంసంలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అయితే.. మరీ ఎక్కువగా ఉండకూడదు..మాంసం మీద నిమ్మకాయ పిండడం వల్ల తినేవారికి తాజా రుచి వస్తుంది. నిమ్మకాయలోని సిట్రస్ యాసిడ్లు నిస్సందేహంగా మాంసానికి సున్నితత్వాన్ని జోడిస్తాయి.


జీర్ణక్రియను..

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ మన శరీరంలోని అనేక రసాయనాలను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. మాంసం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. నిమ్మకాయను పిండడం ద్వారా జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.

హానికరమైన బ్యాక్టీరియాను..

తాజా మాంసం కొన్నిసార్లు హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. నిమ్మకాయలో ఈ బ్యాక్టీరియాను చంపే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. మాంసాహారంలో నిమ్మరసం పిండడం వల్ల రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మేలు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Updated Date - Jan 18 , 2025 | 06:46 PM