Share News

Tips To Be Healthy: శరీరాన్ని ఫిట్‌గా ఉంచే ఆరోగ్య చిట్కాలు ఇవే.!

ABN , Publish Date - Aug 04 , 2025 | 07:53 AM

ఈ అలవాట్లను అనుసరించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Tips To Be Healthy:  శరీరాన్ని ఫిట్‌గా ఉంచే ఆరోగ్య చిట్కాలు ఇవే.!
Healthy Family

ఇంటర్నెట్ డెస్క్‌: కొన్ని అలవాట్ల కారణంగా, చాలా మంది పదే పదే అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే, ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను అనుసరించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. ఏ అలవాట్లు మనల్ని ఫిట్‌గా ఉండటానికి సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..


నిద్ర- రోగనిరోధక శక్తి కోసం:

ఆరోగ్యంగా ఉండటానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. రాత్రి త్వరగా పడుకోని, ఉదయం త్వరగా నిద్ర లేవండి. మంచి నాణ్యమైన నిద్ర పొందండి. ఎందుకంటే సరిగ్గా నిద్రపోకపోతే రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. దీని కారణంగా, మీరు తరచు అనారోగ్యానికి గురవుతారు.

ధ్యానం - మనశ్శాంతి కోసం:

ప్రతిరోజూ పది నిమిషాలు ధ్యానం చేయండి. ఇలా ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. మీ రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. ఈ అభ్యాసం మీ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.


వాకింగ్:

భోజనం తర్వాత కనీసం పది నిమిషాలు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. ఇలా నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధించవచ్చు. చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటే, డయాబెటిస్‌ను నివారించవచ్చు. అలాగే, నడక జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

వ్యాయామం:

మీరు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. వాకింగ్, జాగింగ్, ఈత, నృత్యం వంటి ఏదైనా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


ఆరోగ్యకరమైన ఆహారం:

మనం తీసుకునే ఆహారం కూడా మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి. పండ్లు, కూరగాయలు తినడంతో పాటు, మీరు డ్రై ఫ్రూట్స్, నట్స్, పప్పుధాన్యాలు, గుడ్లు, చేపలు, మొలకెత్తిన ధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా తినాలి. ప్రాసెస్ చేసిన, జంక్, వేయించిన ఆహారాన్ని వీలైనంత వరకు తినకుండా ఉండండి.

చల్లటి నీటితో స్నానం:

మీరు ప్రతిరోజూ చల్లటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీరు రోజంతా చురుకుగా ఉంటారు. అలాగే, రోజుకు రెండుసార్లు బ్రెష్ చేయడం అలవాటు చేసుకోండి. అదేవిధంగా, భోజనానికి ముందు, టాయిలెట్‌కి వెళ్ళిన తర్వాత మీ చేతులను కడుక్కోండి. ఇలా చేయడం ద్వారా, మీరు ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉండవచ్చు.

Updated Date - Aug 04 , 2025 | 07:56 AM