Health Tips: వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదా.. బీ అలర్ట్..
ABN , Publish Date - Jun 21 , 2025 | 03:44 PM
చాలా మంది తాము వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదని అంటుంటారు. అయితే, అలాంటి వారు వెంటనే ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఏ వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
Health Tips: ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. గంటలు తరబడి ఆసనాలు కూడా చేస్తారు. అయితే, తాము వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదని కొంత మంది అంటుంటారు. కొన్నిసార్లు బరువు తగ్గకపోవడానికి కొన్ని తీవ్రమైన ఆరోగ్య కారణాలు ఉండవచ్చు. వీటిలో థైరాయిడ్ అసమతుల్యత లేదా హార్మోన్ల మార్పులు మొదలైనవి ఉన్నాయి. అయితే, అలాంటి వారు వెంటనే ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఏ వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
థైరాయిడ్ పరీక్ష
మీరు బరువు పెరుగుతూ ఉంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. ఇది శరీరంలోని థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతను తనిఖీ చేయడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియ, శక్తి స్థాయి, బరువు, మానసిక స్థితిని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే హైపర్ థైరాయిడిజం ఉండి బరువు తగ్గకపోతే, వైద్యుడిని సంప్రదించి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. దీని కోసం TSH, T3, T4 అనే పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, కుటుంబంలో థైరాయిడ్ సమస్య ఉన్నారు, అలసట లేదా నీరసంగా ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరీక్ష చేయించుకోవాలి.
హార్మోన్ సంబంధిత సమస్య
మహిళల్లో బరువు పెరగడానికి ఒక సాధారణ కారణం PCOS లేదా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కావచ్చు. ఇది హార్మోన్ సంబంధిత సమస్య. ఇది శరీర జీవక్రియను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా బరువు వేగంగా పెరుగుతారు. దానిని తగ్గించడం చాలా కష్టం అవుతుంది. థైరాయిడ్‌ను తనిఖీ చేయడానికి, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ (TSH, T3, T4), విటమిన్ D, విటమిన్ B12, ఫాస్టింగ్ ఇన్సులిన్, బ్లడ్ షుగర్ టెస్ట్ చేయాలి. దీనితో పాటు, PCOS, హార్మోన్ల ప్రొఫైల్‌ను కూడా చెక్ చేయించుకోవాలి.
మంచి జీవనశైలి
బరువు తగ్గడానికి కేవలం వ్యాయామం చేస్తే సరిపోదు. మంచి జీవనశైలి కూడా చాలా ముఖ్యం. చాలా మంది వ్యాయామం చేసిన తర్వాత అవసరమైన దానికంటే ఎక్కువగా తింటారు. సరిగ్గా నిద్రపోరు లేదా ఒత్తిడిలో ఉంటారు. ఇలా ఉండటం వల్ల కూడా బరువు తగ్గడం కష్టమవుతుంది. కాబట్టి, మంచి ఆరోగ్యం కోసం వ్యాయామంతో పాటు మంచిగా నిద్ర పోవడం, సరైన ఆహారం తీసుకోవడం అలాగే మనశ్శాంతిగా ఉండటం చాలా ముఖ్యం. సిగరెట్, మందు అలవాటు ఉంటే మానుకోవడం మరింత మంచిది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
గర్భిణీ స్త్రీలు యోగా చేయొచ్చా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..
మైగ్రేన్‌తో బాధపడుతున్నారా.. ఉపశమనం పొందడానికి ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయండి..
For More Health News