Tips to Reduce Non-Veg Intake: నాన్ వెజ్ ఎక్కువగా తిని ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేయండి
ABN , Publish Date - Oct 03 , 2025 | 09:52 AM
దసరా పండుగ సందర్భంగా నాన్ వెజ్ ఎక్కువగా తిని ఇబ్బంది పడుతున్నారా? అయితే, ఈ సింపుల్ హెల్తీ టిప్స్ మీ కోసం..
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 2న అటు దసరా, ఇటు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ జయంతి సందర్భంగా మాంసాహారం, మద్యపాన నిషేధం ఉన్నప్పటికీ మన వాళ్లు మాత్రం ముక్క, చుక్క విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదని చెప్పాలి. ఎందుకంటే, దసరా పెద్ద పండుగ కావడంతో నచ్చిన మాంసాహార వంటకాలను ఫుల్‌గా లాగించేశారు. ఈసారి మందు, మాంసం పబ్లిక్‌గా దొరక్కున్నా కూడా ముందుగానే సమకూర్చుకుని తమ సరదా తీర్చుకున్నారు. అయితే, మీరు కూడా దసరా సందర్భంగా నాన్ వెజ్ ఫుల్‌గా తిని ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారా? మీ కోసం కొన్ని సింపుల్ హెల్తీ టిప్స్..
నాన్ వెజ్ ఎక్కువగా తిన్నవారు లైట్, ఫైబర్ రిచ్, లోఫ్యాట్ డైట్ పాటిస్తూ ప్రోబయాటిక్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇడ్లీ వంటి తేలికైన ఆహారాన్ని, పండ్లు, తృణధాన్యాలు, గింజలు ఫైబర్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతాయి.
నిమ్మకాయలో ఆహారాన్ని అరిగించే గుణం ఎక్కువగా ఉంటుంది. మీకు కడుపు ఉబ్బరంగా ఉంటే.. ఓ గ్లాసుడు నిమ్మరసం తాగండి. కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది.
సోంపు నీరు కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి, ఒక గ్లాస్ వాటర్‌లో ఒక స్పూన్ సోంపును వేసి 5 నిమిషాలు మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి. ఇది అజీర్తి, ఎసిడిటీని దూరం చేస్తుంది.
ఆహారాన్ని జీర్ణం చేయడంలో జీలకర్ర కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది మార్నింగ్ సిక్ నెస్‌ని, కడుపు నొప్పిని, విరేచనాలను దూరం చేయడంలో సహాయపడుతుంది. ఓ స్పూన్ జీలకర్ర నీరు తాగితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.
మరి ముఖ్యంగా హైడ్రేషన్ కోసం నీరు ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
(Note: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలు ఇవే..
తులసి ఆకులు తినడం.. ఆరోగ్యానికి మంచిదా ? కాదా?
For More Latest News