Health Tips: చలికాలంలో ఈ జ్యూస్ తాగితే త్వరగా పొట్ట తగ్గుతుంది..
ABN , Publish Date - Jan 08 , 2025 | 02:12 PM
అధిక బరువు కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ఈ జ్యూస్‌లు తాగడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు.
చాలా మంది అధిక బరువు కారణంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్, యోగా, డైట్, వర్కవుట్ వంటి ఎన్నో సర్కస్‌లు చేస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా కొంతమంది బరువు తగ్గరు. అయితే, ఉదయాన్నే కాస్త జ్యూస్ తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండి బరువు అదుపులో ఉంటుంది. ముఖ్యంగా, ఈ స్పెషల్ జ్యూస్ లను ప్రతిరోజూ తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ సులభంగా కరిగిపోతుంది. ఈ జ్యూస్‌లు తాగడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు. మరి ఆ జ్యూస్‌లు ఏమిటో తెలుసుకుందాం..
క్రాన్‌బెర్రీ జ్యూస్: క్రాన్‌బెర్రీ జ్యూస్‌లో కేలరీలు చాలా తక్కువ, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి పోషణతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థం కడుపు నిండుగా ఉంచి ఆకలిని నియంత్రిస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు జీవక్రియను పెంచుతుంది. అంతేకాకుండా శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. ఈ ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ పెరగదు. అలాగే ఇది అతిగా తినడాన్ని నియంత్రించడంతోపాటు, కొవ్వును తగ్గిస్తుంది.
క్యారెట్ జ్యూస్: చలికాలంలో క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. క్యారెట్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి, జీవక్రియను పెంచే ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ రసంలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరగడానికి అనుమతించదు. క్యారెట్ రసంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని టాక్సిక్ ఎలిమెంట్స్ తగ్గి బరువు తగ్గుతారు.
ఆరెంజ్ జ్యూస్: విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ జ్యూస్ లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ పెరుగుతుందనే ఆందోళన అవసరం లేదు. విటమిన్ సి పుష్కలంగా ఉన్న నారింజ రసం జీవక్రియను పెంచుతుంది. కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉండి బరువు తగ్గుతుంది. రోజూ ఈ జ్యూస్ తాగితే శరీరంలోని కొలెస్ట్రాల్ త్వరగా తగ్గుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)