Share News

Hot Water: చలికాలంలో అదే పనిగా వేడి నీరు తాగుతున్నారా.. దుష్ప్రభావాలు తప్పవు..

ABN , Publish Date - Jan 20 , 2025 | 09:07 AM

చలికాలంలో చాలా మంది ఎక్కువగా వేడి నీరు తాగడానికి ఇష్టపడతారు. అలా తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, అతిగా తాగితే మాత్రం దుష్ప్రభావాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Hot Water: చలికాలంలో అదే పనిగా వేడి నీరు తాగుతున్నారా.. దుష్ప్రభావాలు తప్పవు..
Hot Water

Hot Water Side Effects: వేడి నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతారు. గొంతు నొప్పు, అజీర్ణం వంటి అనేక వ్యాధులకు వేడి నీటిని తాగాలని సూచిస్తారు. దీంతో కొంత మంది అదే పనిగా వేడి నీటిని తాగుతుంటారు. ముఖ్యంగా చలికాలంలో వేడి నీటినే ఎక్కువగా తీసుకుంటారు. అయితే, ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి నీరును ఎక్కువగా తాగడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయని అంటున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వేడి నీటిని ఎక్కువగా తీసుకుంటే కలిగే సమస్యలు ఇవే:

డీహైడ్రేషన్‌: శరీరం హైడ్రేటెడ్ గా ఉండాలంటే నీరు చాలా ముఖ్యం. అయితే, వేడి నీటిని ఎక్కువగా తాగితే డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఎందుకంటే వేడి నీరు ఎక్కువగా తాగితే చమట పడుతుంది. దీని వల్ల బాడీ డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. కాబట్టి, వేడి నీటిని ఎక్కువగా తాగడం మానుకుంటే మంచిది.

జీర్ణ సమస్యలు: వేడి నీటిని ఎక్కువగా తాగడం పొట్టకు మంచిది కాదు. ఎందుకంటే కడుపు సమస్యలు వస్తాయి. కడుపు చికాకు కలిగి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, జీర్ణ సమస్యలను నివారించడానికి ఎక్కువగా వేడి నీటిని తాగకండి. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల నోరు, గొంతు సమస్యలు వస్తాయి. వేడి నీళ్లకు బదులుగా సాధారణ నీరు తాగితే మంచిది.


దంత సమస్యలు: వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల దంత సమస్యలు వస్తాయి. దంతాలపై ఉన్న ఎనామిల్ దెబ్బ తింటుంది. ఇది దంతాల మీద చెడు ప్రభావం చూపుతుంది. దంతాల సున్నితత్వం పెరగడంతోపాటు కావిటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగండి..

వేడి నీటి నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం మంచిది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గోరువెచ్చని నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. రక్త ప్రసరణ కూడా సక్రమంగా అవుతుంది. అర్థరైటీస్ సమస్యలు ఉన్న వారు వేడి నీటిని తాగడం మంచిది. అంతేకాకుండా వేడి నీటిని తాగితే జలుబు, గొంతు సమస్యలు, న్యూమోనియా దూరం అవుతాయి. దగ్గు, పడిశం ఉన్నవారు వేడి నీరు ఉదయాన్నే తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Updated Date - Jan 20 , 2025 | 09:08 AM