Health Tips: గుండెపోటు రాకుండా ఉండాలంటే వీటిని తినండి..
ABN , Publish Date - Jan 17 , 2025 | 01:06 PM
గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ గుండెను ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి.

Heart Attack: ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉన్నట్టుండి గుండెజబ్బుతో మరణించిన ఘటనలు మనం చూస్తునే ఉన్నాం. అయితే, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. నేటి బిజీ లైఫ్‌లో, గుండెకు హాని కలిగించే జంక్ ఫుడ్, అనారోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. కానీ, మీరు మీ గుండెను ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, ఈ 5 యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు అధికంగా ఉండే ఈ కూరగాయలను మీ ఆహారంలో చేర్చుకోవాలి.
బీట్‌రూట్:
బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను పెంచి, బీపీని అదుపులో ఉంచుతాయి. అదనంగా, ఇందులో ఫోలిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాబట్టి బీట్‌రూట్‌ను మీ ఆహారంలో చేర్చుకుని ఆరోగ్యంగా ఉండండి.
రెడ్ క్యాప్సికమ్:
రెడ్ క్యాప్సికమ్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం వల్ల బీపీని అదుపులో ఉంచుతుంది. అయితే, వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు.
యాపిల్స్:
యాపిల్స్ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాకుండా సిరల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోజుకో యాపిల్ తింటే గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
స్ట్రాబెర్రీ:
స్ట్రాబెర్రీలలో లైకోపీన్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా, ఇందులో ఫైబర్, విటమిన్ సి కూడా ఉన్నాయి, ఇవి బిపిని నియంత్రించడంలో సహాయపడటం తోపాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
టమాటో:
టమాటోలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉన్నందున ఇది గుండెకు అద్భుతమైన ఆహారం. ఈ యాంటీఆక్సిడెంట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)