Share News

Health Tips: అన్నం తినేటప్పుడు, తిన్న వెంటనే నీరు తాగకండి.. ఎందుకంటే..

ABN , Publish Date - Jan 20 , 2025 | 04:11 PM

ఆహారం తీసుకునే అరగంట ముందు.. తిన్న అరగంట తర్వాత నీరు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, నీరు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Health Tips: అన్నం తినేటప్పుడు, తిన్న వెంటనే నీరు తాగకండి.. ఎందుకంటే..

నీరు తాగితే శరీరానికి ఎంతో మంచిది. రోజుకు 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో నీరు తాగడం మంచిది కాదు. ముఖ్యంగా ఆహారం తినేటప్పుడు, తిన్న తర్వాత నీరు తీసుకోవడం కరెక్ట్ కాదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం ఎన్ని చెప్పినా కూడా తినే సమయంలో, తిన్న వెంటనే నీరు తాగుతారు. అయితే, ఆ సమయంలో నీరు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? నీరు ఎప్పుడు తాగితే మంచిది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

జీర్ణ సమస్యలు..

అన్నం తీసుకునే అరగంట ముందు.. తిన్న అరగంట తర్వాత నీరు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం తినేటప్పుడు నీరు తాగడం ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఫుడ్ తినేటప్పుడు, తిన్న వెంటనే నీరు తాగితే తిన్న ఫుడ్ త్వరగా జీర్ణం కాదని నిపుణులు చెబుతున్నారు. ఆహారం తీసుకున్న వెంటనే నీరు తీసుకోవడం వల్ల జీర్ణరసాలు పలుచగా మారి జీర్ణ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.


ఉబ్బరం సమస్యలు..

తిన్న తర్వాత ఆహారం జీర్ణం అవ్వడానికి కొంత సమయం పడుతుందని.. ఆ లోపల నీరు తాగితే జీర్ణప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని, ఈ క్రమంలో కడుపు ఉబ్బరం సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఫుడ్ తినేటప్పుడు, తీసుకున్న వెంటనే నీరు తాగకూడదని వివరిస్తున్నారు.

అరగంట తర్వాత..

ఆహారం తీసుకున్న వెంటనే నీరు తాగితే ఫుడ్ కొంత జీర్ణం కాకుండా మిగిలిపోయి.. అది కొవ్వు రూపంలో నిల్వ అవుతుంది. ఆ తర్వాత ఇది ఊబకాయానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీంతో షుగర్ అటాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే అన్నం తినే అరగంట ముందు, ఫుడ్ తీసుకునేటప్పుడు, అన్నం తీసుకున్న అరగంట తర్వాత నీరు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - Jan 20 , 2025 | 04:11 PM