Share News

Date Seeds: ఖర్జూర విత్తనాలను పడేస్తున్నారా.. వాటి ప్రయోజనాలు తెలుస్తే ఆశ్చర్యపోతారు..

ABN , Publish Date - Jan 24 , 2025 | 09:23 AM

చాలా మంది ఖర్జూర తిన్న తర్వాత దాని విత్తనాలు ఎందుకు పనికిరావని పడేస్తారు. కానీ, ఆ విత్తనాలు కూడా అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Date Seeds: ఖర్జూర విత్తనాలను పడేస్తున్నారా.. వాటి ప్రయోజనాలు తెలుస్తే ఆశ్చర్యపోతారు..
Date Seeds

Date Seed Benefits: ఖర్జూరలో అనేక పోషకాలు ఉంటాయి. సుక్రోజ్, ఫ్రక్టోజ్ గ్లూకోజ్ తో సహా సహజ చక్కెరలను కలిగి ఉన్నందున వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో వీటిని తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతారు. కానీ, ఖర్జూర తిన్న తర్వాత వాటి విత్తనాలు ఎందుకు పనికి రావని చాలా మంది పడేస్తారు. అయితే, వాటిలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరం

ఖర్జూర అనేక రకాల వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా, రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఖర్జూరలాగే దీని గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీని విత్తనాలు రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి, డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి.

జీర్ణక్రియ ప్రక్రియకు మేలు..

ఖర్జూర విత్తనాలు కడుపుకు చాలా మేలు చేస్తాయి. ఇది శరీరంలో జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఖర్జూర పొడిని తయారు చేసి ఉపయోగించడం వల్ల అనేక ఉదర వ్యాధులకు మేలు జరుగుతుంది.


గుండె ఆరోగ్యానికి..

ఖర్జూర విత్తనాలు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఖర్జూర పొడి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని వినియోగం గుండె సంబంధిత వ్యాధులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఖర్జూర గింజల్లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల శరీరాన్ని సహజంగా ఫిల్టర్ చేయడంలో సహాయపడుతుంది.

ఖర్జూరాలను బాగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. ఎండబెట్టిన తరువాత, వాటిని తేలికగా వేయించాలి, తద్వారా వాటి తేమ పూర్తిగా పోతుంది. చల్లారిన తర్వాత ఈ గింజలను గ్రైండర్ లో మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Updated Date - Jan 24 , 2025 | 09:43 AM