Share News

Tomato: మధుమేహ వ్యాధిగ్రస్తులు టమోటాలు తినవచ్చా..

ABN , Publish Date - Jan 18 , 2025 | 02:31 PM

మధుమేహంతో బాధపడేవారు టమోటాలు ఎక్కువగా తినకూడదని చెబుతారు. అయితే, ఇందులో నిజమెంత? మధుమేహ వ్యాధిగ్రస్తులు టమోటాలు తినవచ్చా? లేదా? దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. .

Tomato: మధుమేహ వ్యాధిగ్రస్తులు టమోటాలు తినవచ్చా..
Tomato

Tomato: మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల డయాబెటిస్ వ్యాధి ఎక్కువగా ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. మధుమేహానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది ఒకసారి వచ్చిందంటే మాత్రం అదుపు చేయడం తప్ప మన చేతుల్లో ఇంకేమి ఉండదు. అంతేకాకుండా, ఇది ఇతర జబ్బులను కూడా వెంటబెట్టుకొస్తుంది. కాబట్టి, మధుమేహం ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

షుగర్ ఉన్నవారు ఏం తినకూడదు? అనే విషయాలను తెలుసుకోని ఉండాలి. ఆహారం కూడా చాలా పరిమితంగా తీసుకోవాలి. లేదంటే షుగర్ పెరిగే అవకాశం ఉంది. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు టమోటాలు తినవచ్చా? అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. మధుమేహంతో బాధపడేవారు టమోటాలు ఎక్కువగా తినకూడదని చెబుతారు. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు టమోటాలు తినవచ్చా? లేదా? దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.


టమోటాలను తినవచ్చు..

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎటువంటి సందేహం లేకుండా టమోటాలను తినవచ్చు. టమాటో తీసుకోవడం ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. టమాటో మధుమేహానికి అనుకూలమైన కూరగాయ అని చెబుతారు. కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి భయం లేకుండా టమోటాలను తినవచ్చు. టమోటాలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, అతిగా తింటే మాత్రం అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Updated Date - Jan 18 , 2025 | 02:32 PM