Share News

Health Tips: బీట్‌రూట్ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..

ABN , Publish Date - Jan 18 , 2025 | 01:53 PM

బీట్‌రూట్ ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, ఇది ఎంత ఆరోగ్యకరమో, దాని ఆకులు కూడా అంతే పోషక విలువలు కలిగి ఉంటాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 Health Tips: బీట్‌రూట్ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
Beetroot Leaves

Beetroot Leaves Benefits: బీట్‌రూట్ ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే, బీట్‌రూట్ ఎంత ఆరోగ్యకరమో, దాని ఆకులు కూడా అంతే ఆరోగ్యకరం. బీట్‌రూట్ ఆకులు ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయి. కానీ, చాలామంది బీట్‌రూట్‌ను మాత్రమే తీసుకుంటూ వాటి ఆకులను పారేస్తుంటారు. దాని ప్రయోజనాలు తెలిస్తే ఆ ఆకులను అస్సలు వదిలిపెట్టరు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రోగనిరోధక శక్తి: బీట్‌రూట్ ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. బీట్‌రూట్ ఆకుల్లోని విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ ఆకుల్లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి కణాలను రక్షించేలా చేస్తుంది.


గుండె ఆరోగ్యానికి మేలు : బీట్‌రూట్ ఆకుల్లోని నైట్రేట్లు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారతాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణను మెరుగుపడేలా చేస్తుంది. దీనివల్ల రక్తపోటు కూడా తగ్గుతుంది. ఈ ఆకులు గుండె సంబంధిత సమస్యలు నివారించేలా ఉపయోగపడుతాయి.

కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యం: బీట్‌రూట్ ఆకుల్లో ఉండే విటమిన్ ఎ, లుటీన్, జియాక్సంతిన్ వంటి కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వయసుతో వచ్చే కంటి సమస్యలను ఈ ఆకులు నివారించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా కంటి శుక్లం వంటి సమస్యలను నివారించడంలో ఈ బీట్‌రూట్ ఆకులు ఉపయోగపడతాయి. కాబట్టి, కేవలం బీట్‌రూట్ మాత్రమే కాకుండా దాని ఆకులను కూడా మీ ఆహారంలో తీసుకోండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Updated Date - Jan 18 , 2025 | 01:54 PM