Banana: రాత్రిపూట అరటిపండు తినడం మంచిదా..
ABN , Publish Date - Jan 18 , 2025 | 05:59 PM
మనలో చాలా మందికి రోజూ రాత్రి భోజనం తర్వాత అరటిపండు తినడం అలవాటు. కొందరు ఇష్టంగా తింటే, మరికొందరు ఆరోగ్యానికి మంచిది అని తింటారు. అయితే, రాత్రిపూట అరటిపండు తినడం మంచిదా? కాదా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

Banana: అరటిపండ్లను చాలా మంది ఎంతో ఇష్టంతో తింటారు. ఇది తక్కువ ధరకే వస్తుంది. మనలో చాలా మందికి రోజూ రాత్రి భోజనం తర్వాత అరటిపండు తినడం అలవాటు. కొందరు ఇష్టంగా తింటే, మరికొందరు ఆరోగ్యానికి మంచిది అని తింటారు. అయితే, రాత్రిపూట అరటిపండు తినడం మంచిదా? కాదా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రిపూట అరటిపండు తినడం గురించి చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కొందరు రాత్రిపూట అరటిపండు తింటే మంచిది అంటారు. ఇంకొందరు మంచిది కాదు అని అంటారు. నిజానికి రాత్రి సమయంలో అరటిపండు తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు, కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయోజనాలు:
రాత్రిపూట హెవీ ఫుడ్ తీసుకుంటే ఎసిడిటీ, గుండెల్లో మంట సమస్యలు వస్తాయి. కాబట్టి, హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు అరటిపండు తింటే ఎసిడిటీ సమస్య ఉండదు. ఎందుకంటే కడుపులోని యాసిడ్ ప్రభావాన్ని తగ్గించడంలో అరటిపండు ఎంతగానో సహాయపడుతుంది.
మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే రాత్రిపూట అరటిపండు తింటే ఎంతో మంచిది. ఎందుకంటే దీనిలోని పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
దుష్ప్రభావాలు:
జలుబు: రాత్రి సమయంలో అరటిపండు తినడం మంచిది కాదు. ఎందుకంటే జలుబు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికే జలుబుతో బాధపడేవారు అరటిపండు తినకపోవడం మంచిది.
నిద్ర సమస్యలు: రాత్రిపూట అరటిపండు తినడం వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. ఎందుకంటే దీనిలో తక్కువ మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి, ఇది నిద్రకు సహకరించదు.
జీర్ణక్రియపై ప్రభావం: అరటిపండులో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది.
బరువు పెరుగుతారు: రాత్రిపూట అరటిపండు తింటే బరువు పెరుగుతారు. ఎందుకంటే దీనిలో కెలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఆ సమయంలో అరటిపండుకు దూరంగా ఉండటమే మేలు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)