Foods - Hormonal Imbalance: ఈ ఫుడ్స్‌ను కలిపి తింటే.. హార్మోన్లు కట్టుతప్పటినట్టే..!
ABN , Publish Date - Mar 10 , 2025 | 03:54 PM
హార్మోన్ల మధ్య సమతౌల్యం దెబ్బ తినకుండా ఉండాలంటే కొన్ని ఫుడ్స్ కలిపి తినకూడదు. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: కొందరికి తీపి అంటే ఇష్టం. మరికొందరికి ఘాటు పదార్థాలు అంటే ఇష్టం. అయితే, భోజనానికి కూర్చున్నప్పుడు అన్ని రకాల ఫుడ్స్ ట్రై చేయాలని అని చాలా మంది అనుకుంటారు. కానీ కొన్ని రకాల ఫుడ్స్ కాంబినేషన్స్‌తో హార్మోన్ల సమతౌల్యం చెడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Health).
నిపుణులు చెప్పే దాని ప్రకారం, పాలు, పండ్లు కలిపి అస్సలు తినకూడదు. ముఖ్యంగా పాలతో పాటు అరటి లేదా నిమ్మ జాతి పండ్లు తీసుకోవడం మంచిది కాదు. దీని వల్ల జీర్ణక్రియ నెమ్మదించి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది (Foods - Hormonal Imbalance).
టీ, లేదా కాఫీతో పాటు ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలను తినకూడదు. టీ,కాఫీల్లోని టానిన్స్ అనే పదార్థాలు శరీరం ఐరన్‌ను గ్రహించకుండా అడ్డుపడతాయి. ఇది చివరకు శక్తి హీనత, అలసట, హార్మోన్ల మధ్య అసమతౌల్యానికి దారి తీస్తుంది.
పాల ఉత్పత్తులతో పాటు చక్కెర ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. చాలా మందికి ఓ చిన్న గిన్నెలో స్ట్రాబెర్రీలతో పాటు యోగర్ట్ వేసుకుని తినడం ఇష్టం. ఇలా చేస్తే ఇన్సూలీన్ స్పైక్స్‌తో పాటు పీసీఓఎస్ తీవ్రమవుతుంది. జీవక్రియలు అస్తవ్యస్తంగా మారతాయి.
చపాతీలతో పాటు చక్కెర తీసుకునే వారు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ కాంబినేషన్‌తో బ్లడ్ షుగర్ స్థాయి అకస్మాత్తుగా తగ్గొచ్చు. ఆకలి పెరగడం, మూడ్స్‌లో తీవ్ర మార్పులు వంటివి మాత్రమే కాకుండా శరీరంలో వేగంగా కొవ్వు పేరుకుంటుంది.
High BP Myths: హైబీపీ.. ప్రజల్లో అపోహలు.. వాస్తవాలు!
ఇక పరాఠా లేదా పలావ్‌కు పెరుగు జోడించి ఎంజాయ్ చేసేవారు కూడా ఉన్నారు. ఇది కూడా ప్రమాదకరమే అని నిపుణులు చెబుతున్నారు. పాల ఉత్పత్తులు, పిండిపదార్థం అధికంగా ఉన్న ఆహారాలు కలిపి తిన్నప్పుడు అరుగుదల సమస్యలు మొదలవుతాయి. పేగుల్లోని బ్యాక్టీరియాపై ప్రభావం పడి చివరకు హార్మో్న్ల అసమతౌల్యతకు దారి తీస్తుంది. కాబట్టి, ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉంటే హార్మో్న్ల మధ్య సమతౌల్యం నిలిచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.