Health Tips: ఈ చిన్న అలవాట్లతో గుండె సమస్యలు దూరం..
ABN , Publish Date - Jun 30 , 2025 | 08:12 AM
ఈ రోజుల్లో మందులు, ఖరీదైన చికిత్సలు కొన్నిసార్లు మన శరీరానికి హాని కలిగిస్తాయి. అధిక వ్యాయామం కూడా గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి..
జీవనశైలి, ఆహారపు అలవాట్లు మన గుండె ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా, మన చిన్న చిన్న రోజువారీ అలవాట్లు గుండెకు హాని కలిగిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. దీనితో పాటు మందులు, ఖరీదైన చికిత్సలు కూడా కొన్నిసార్లు మన శరీరానికి హాని కలిగిస్తాయి. అధిక వ్యాయామం కూడా గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి, మనం కొన్ని సులభమైన, ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భోజనం తర్వాత నడక
భోజనం తర్వాత 10 నిమిషాల నడక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే కూర్చునే అలవాటును మార్చుకోని 10 నిమిషాల నడవడం మంచిది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు పెరగకుండా నిరోధిస్తుంది.
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు
మీ రోజువారీ ఆహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండేలా చూసుకోండి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె, మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇది మెదడు వాపును నియంత్రించడంలో సహాయపడుతుంది. చేపలు, అవిసె గింజలు వంటి వాటి నుండి మీరు ఒమేగా-3ని పుష్కలంగా పొందవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, మీరు మీ ఆహారంలో పండ్లు, ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. వాటిలో మన గుండెను బలంగా, ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉంటాయి.
7-9 గంటల నిద్ర
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రతిరోజూ 7-9 గంటలు నిద్ర పొందడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మందికి రాత్రిపూట ఫోన్ వాడటం, టీవీ చూడటం అలవాటుగా మారింది. అయితే, సరిగ్గా నిద్రలేకపోయినా ఊబకాయం, వ్యాధులు, అలసట వంటి సమస్యలు వస్తాయి.
గాజును ఉపయోగించండి
గుండె ఆరోగ్యానికి ప్లాస్టిక్ వస్తువులను నివారించడం చాలా ముఖ్యం. ప్లాస్టిక్‌కు బదులుగా గాజును ఉపయోగించాలి. ప్లాస్టిక్‌లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతపై ప్రభావం చూపించి శరీరానికి హాని కలిగిస్తాయి. ప్లాస్టిక్ రసాయనాలు నెమ్మదిగా శరీరంలో విషాన్ని వ్యాపింపజేస్తాయి. ఇది క్యాన్సర్, ఇతర వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల, ఆహారాన్ని నిల్వ చేయడానికి గాజు లేదా ఉక్కు పాత్రలు మంచివి. ఇవి మీ గుండె ఆరోగ్యానికి అలాగే మొత్తం ఆరోగ్యానికి సురక్షితమైనవి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఈ 5 అలవాట్లు పాటిస్తే.. వయస్సు పెరిగినా అందం తగ్గదు..
చర్మం, పాదాలపై కనిపించే ఈ లక్షణాలు విటమిన్ డి లోపానికి సంకేతమా..
For More Health News