Share News

Food For Piles: పైల్స్ నుండి ఉపశమనం పొందడానికి ఏమి తినాలో తెలుసా?

ABN , Publish Date - Jul 21 , 2025 | 01:04 PM

పైల్స్‌తో బాధపడేవారు ఉపశమనం పొందడానికి అనేక నివారణలను ప్రయత్నిస్తారు. అంతేకాకుండా ఖరీదైన మందులు కూడా తీసుకుంటారు. అయితే, ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే పైల్స్ నుండి రిలీఫ్ పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 Food For Piles:  పైల్స్ నుండి ఉపశమనం పొందడానికి ఏమి తినాలో తెలుసా?
Piles

ఇంటర్నెట్ డెస్క్‌: పైల్స్ సమస్య చాలా అసౌకర్యంగా ఉంటుంది. మలవిసర్జన సమయంలో నొప్పి, దురద, రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి క్రమంగా తీవ్రమవుతుంది. ఈ వ్యాధితో బాధపడేవారు ఉపశమనం పొందడానికి అనేక నివారణలను ప్రయత్నిస్తారు. ఖరీదైన మందులను తీసుకుంటారు. కానీ, కొన్ని సార్లు ఈ మందులు ఉపశమనం కలిగించవు. అయితే, ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే పైల్స్ నుండి రిలీఫ్ పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


నిమ్మరసం:

నిపుణుల అభిప్రాయం ప్రకారం, పైల్స్‌తో బాధపడేవారు నిమ్మరసం తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మరసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని, ఇది మలద్వారంలో మంట, నొప్పి సమస్యను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.

నానబెట్టిన ఎండుద్రాక్ష:

పైల్స్ సమస్యతో బాధపడేవారికి నానబెట్టిన ఎండుద్రాక్ష ఉపయోగపడుతుంది. వీటిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజూ ఒక కప్పు నీటిలో 100 గ్రాముల ఎండుద్రాక్షను నానబెట్టి రాత్రంతా ఉంచండి. ఉదయం ఖాళీ కడుపుతో ఎండుద్రాక్షతోపాటు నానబెట్టిన నీటిని కూడా తాగండి. మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


పసుపు:

పసుపు అనేక వైద్య లక్షణాలు కలిగి ఉంది. మీరు సహజంగా పైల్స్ ను నివారించాలనుకుంటే పసుపుకొమ్మ లేదా పసుపును నీటిలో వేసి ఆ నీటిని ఉదయం తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే మూలకం పైల్స్ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.

అరటి పండు:

అరటిపండు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. పండిన అరటిపండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం లేదా ప్రతి భోజనం తర్వాత అరటిపండు తినడం మంచిది.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

For More Health News

Updated Date - Jul 21 , 2025 | 01:07 PM