Share News

Corn Health Tips: కాల్చిన మొక్కజొన్న తినే ముందు ఇలా చేయండి.. లేదంటే..

ABN , Publish Date - Jul 15 , 2025 | 12:38 PM

మొక్కజొన్నలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది మన శరీరానికి అనేక ప్రయోజనాలను అందించడంలో సహాయపడుతుంది కానీ కొన్నిసార్లు..

Corn Health Tips:  కాల్చిన మొక్కజొన్న తినే ముందు ఇలా చేయండి.. లేదంటే..
Corn

ఇంటర్నెట్ డెస్క్‌ : వర్షాకాలంలో వేడి, కారంగా ఉండే ఆహార పదార్ధాలు చాలా ఆకర్షిస్తాయి. ముఖ్యంగా రోడ్డు పక్కన లభించే వేడిగా కాల్చిన మొక్కజొన్న కంకులను చూస్తే తినకుండా ఉండలేరు. చినుకులు పడుతున్న వర్షంలో వేడిగా కాల్చిన మొక్కజొన్న కంకులను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే, ఇంకొంత మంది మాత్రం ఉడికించిన వాటిని తినడానికి ఇష్టపడతారు. ఇలా మొక్కజొన్న కంకులు కేవలం రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మొక్కజొన్నలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో, గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. అయితే, మొక్కజొన్న తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యం.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • ముందుగా, మనం మొక్కజొన్న తినే ప్రదేశంలో శుభ్రతపై శ్రద్ధ వహించాలి.

  • మొక్కజొన్నను తినే ముందు దానిని పూర్తిగా తనిఖీ చేయాలి. ఎటువంటి కీటకాలు లేకుండా చూసుకోవాలి. మొక్కజొన్న పాడైందో లేదో తెలుసుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. పొట్టు పచ్చగా, తడిగా ఉండాలి. మొక్కజొన్నపై బూజు లేదా రంగు మారినట్లు ఉంటే, అది పాడైపోయిందని అర్థం.

  • మొక్కజొన్న ఎక్కువగా తినడం మంచిది కాదు. మొక్కజొన్నలో ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇది పిండి పదార్థాలు, కేలరీలు కూడా అధికంగా కలిగి ఉంటుంది. మితంగా తినడం ఆరోగ్యానికి మంచిది. కానీ ఎక్కువగా తింటే బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలు రావచ్చు.

  • కడుపు నొప్పి లేదా విరేచనాలు ఉంటే వర్షాకాలంలో మొక్కజొన్న తినకపోవడం మంచిది. లేదంటే సమస్య మరింత పెరుగుతుంది.

  • అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొంత మంది ఉడికించిన మొక్కజొన్నను తినడానికి ఇష్టపడతారు. అయితే, అవి సరిగ్గా ఉడికితేనే తినాలి లేదంటే తినకపోవడం మంచిది. ఎందుకంటే, సగం ఉడికిన మొక్కజొన్న జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.


Also Read:

ఆహారం తింటున్నప్పుడు చెమట పడుతుందా? బీ కేర్ ఫుల్.!

ఆర్గానిక్ టీ vs టీ బ్యాగ్.. ఏ టీ మంచిదో తెలుసా?

For More Health News

Updated Date - Jul 15 , 2025 | 12:47 PM