Share News

Eyesight Improving Tips: కంటిచూపును మెరుగు పరుచుకునేందుకు ఫాలో కావాల్సిన టిప్స్..

ABN , Publish Date - Aug 07 , 2025 | 11:15 PM

కంటి చూపును మెరుగుపరుచుకునేందుకు కొన్ని టిప్స్ ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ ఉపకరణాల వాడకంతో కంటి చూపు మసకబారినట్టు అనిపించే వారికి ఎంతో మేలు చేసే ఈ టిప్స్ ఏంటో కూలంకషంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

Eyesight Improving Tips: కంటిచూపును మెరుగు పరుచుకునేందుకు ఫాలో కావాల్సిన టిప్స్..
Easy Lifestyle Changes Eyesight

ఇంటర్నెట్ డెస్క్: ఈ డిజిటల్ జమానాలో కంటి చూపుపై ఆందోళన సహజమే. ఆహార నియమాలు సరిగా పాటించకపోవడం, జీవనశైలిలో మార్పులు వంటివన్నీ కంటి చూపుపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా 20 అడుగుల దూరంలో ఉన్న వాటిని స్పష్టంగా చూడగలుగుతున్నామంటే కంటి చూపు మెరుగ్గా ఉన్నట్టే. అయితే, జనాల ముఖాలను సరిగా గుర్తించలేకపోతున్నా, తరచూ తల నొప్పి వేధిస్తున్నా, తీక్షణమైన కాంతిలో కళ్లు మసకబారినట్టు అనిపించినా కంటి చూపు దెబ్బతింటున్నటే. అయితే, మన అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే కంటి చూపును సులువుగా మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి మనం పాటించాల్సిన సూచనలేవో ఈ కథనంలో తెలుసుకుందాం.


స్మార్ట్ డివైజ్‌ల స్క్రీన్‌ల వైపు వీలైనంత తక్కువగా చూడాలి. దీంతో, కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.

కంటి ఎక్సర్‌సైజులు చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఫోకస్, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.

కంటి చూపును మెరుగుపరిచే విటమిన్ ఏ, సీ, ఈలతో పాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

చుట్టూ ఉండే వెలుతురు కూడా కంటిచూపును ప్రభావితం చేస్తుంది. కాబట్టి, మీరు ఉండే చోట తగినంత వెలుగురు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. తక్కువ వెలుతురులో రాయడం చదవడం వంటివి చేయకూడదు. నిద్రను కూడా నిర్లక్ష్యం చేయొద్దు. నిద్రకు సంబంధించి షెడ్యూల్‌‌ను కచ్చితంగా ఫాలో కావాలి.


కంటి ఆరోగ్యానికి తగినంత నీరు తాగడం కూడా తప్పనిసరి. హానికారక సూర్య కిరణాల నుంచి రక్షించే కళ్లద్దాలను వాడాలి. నీలి రంగు కాంతి కిరణాల నుంచి రక్షించే ఫిల్టర్‌లు ఉన్న అద్దాలను వాడటం కూడా అవసరం. పని నుంచి అప్పుడప్పుడూ స్వల్ప విరామం తీసుకుంటే కంటి చూపును కాపాడుకోవచ్చు. అరి చేయి వేచ్చగా మారేలా చేతులను రుద్దుకుని కంటిపై పెట్టుకుంటే కూడా కంటి కండరాలు రిలాక్స్ అయ్యి ఒత్తిడి నుంచి సాంత్వన లభిస్తుంది. ధూమపానం కూడా కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇక తరచూ కంటి చెకప్ చేయించుకుంటూ ఉంటే ముప్పు చాలా వరకూ తగ్గుతుంది. ఎప్పుడూ గదిలోని నాలుగు గోడల మధ్యే పరిమితం కాకుండా అప్పుడప్పుడు ఆరుబయట గడుపుతూ ఉంటే కూడా కంటి చూపు మెరుగుతుంది.


ఇవి కూడా చదవండి:

వరుసగా 30 రోజుల పాటు బ్లాక్ కాఫీ తాగితే శరీరంలో కనిపించే మార్పులు

ఈ పొరపాట్లు చేస్తున్నారా.. జీవక్రియలు నెమ్మదిస్తాయి జాగ్రత్త

Read Latest and Health News

Updated Date - Aug 07 , 2025 | 11:28 PM