Share News

Roasters Coffee: ఈ కాఫీ ధర రూ.60,368.. కారణం ఇదే!

ABN , Publish Date - Oct 12 , 2025 | 05:08 PM

వేడి వేడి కాఫీ గొంతులోకి జారుతుంటే ఆ మజానే వేరు. అందుకే చాలా మంది తమ డైలీ రొటీన్​ను కాఫీతో ప్రారంభిస్తారు. అలాగే కాస్త పని ఒత్తిడిగా అనిపించినా, అలసటగా ఉన్నా కాఫీ తాగితే రిలీఫ్​ లభిస్తుందని చాలా మంది అనుకుంటారు. ఈ క్రమంలోనే కొద్దిమంది బ్రేక్​ఫాస్ట్​ చేసిన తర్వాత తాగితే, మరికొందరు మాత్రం ఖాళీ కడుపుతో తాగుతుంటారు.

Roasters Coffee: ఈ కాఫీ ధర రూ.60,368.. కారణం ఇదే!
Roasters Coffee

చాలా మందికి కాఫీ అంటే ఎంతో ఇష్టం. కొందరికి అయితే తెల్లవారగానే చేతిలో కాఫీ ఉండాల్సిందే. మరికొందరు అయితే రోజుకు రెండు, మూడు సార్లు కాఫీని తాగేస్తుంటారు. హోటల్స్ లో టీతో పోలిస్తే కాఫీకే ధర ఎక్కువగా ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో వివిధ ధరల్లో కాఫీ లభిస్తుంటుంది. ఇక స్టార్ హోటల్స్ లో అయితే రూ.300 నుంచి రూ.500 వందలు, ఆపైనే ధర ఉంటుంది. కానీ, ఎక్కడైనా కాఫీ ఖరీదు వేలల్లో ఉంటుందా?. దీనికి చాలా మంది అంత సీన్ లేదులే అని సమాధానం ఇస్తుంటారు. కానీ ఓ కాఫీ ధర అక్షరాలా రూ.60,368 ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మరి.. ఈ స్పెషల్ కాఫీ ఎక్కడ దొరుకుతుంది, దాని ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


వేడి వేడి కాఫీ గొంతులోకి జారుతుంటే ఆ మజానే వేరు. అందుకే చాలా మంది తమ డైలీ రొటీన్​ను కాఫీ(Coffee)తో ప్రారంభిస్తారు. అలాగే కాస్త పని ఒత్తిడిగా అనిపించినా, అలసటగా ఉన్నా కాఫీ తాగితే రిలీఫ్​ లభిస్తుందని చాలా మంది అనుకుంటారు. ఈ క్రమంలోనే కొద్దిమంది బ్రేక్​ ఫాస్ట్ చేసిన తర్వాత తాగితే, మరికొందరు మాత్రం ఖాళీ కడుపుతో తాగుతుంటారు. అందుకే ఇంట్లో కాఫీ లేకపోయినా బయటకు వెళ్లి మరీ తాగుతారు. ఇక కాఫీ తాగే విషయం కాసేపు పక్కన పెడితే.. ఓ కాఫీ ధర అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీగా దుబాయ్‌లోని రోస్టర్స్‌ కాఫీ(Roasters Coffee) గిన్నిస్‌ బుక్‌ రికార్డును సొంతం చేసుకుంది. ఈ వోగ్యుష్‌ కాఫీ అరుదైన పనామా ఎస్మెరాల్డా కాఫీ గింజల(Panama Esmeralda Beans) నుంచి తయారవుతోంది.


రోస్టర్స్‌ కాఫీ(Roasters Coffee) అద్భుత రుచిని, పరిమళాన్ని ఇస్తుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ కాఫీ ఖరీదు 680 డాలర్లుగా ఉంది. ఇది మన కరెన్సీలో రూ.60,368 ఉంటుంది. సహజంగానే, ఈ కాఫీ చాలా మంది వినియోగదారులకు అందుబాటులో ఉండదు, కానీ కొంతమంది మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. ఈ కాఫీ తర్వాత తైవాన్‌కు చెందిన సింపుల్ కాఫా 635 డాలర్లు పలికింది. తరచూ యూఏఈ, చైనా, సౌదీ అరేబియా, జపాన్(Japan), తైవాన్ వంటి దేశాలలో వివిధ రకాల కాఫీ పోటీలు జరుగుతుంటాయి. అలాంటి పోటీల్లోనే రోస్టర్స్ కాఫీ(Roasters Coffee) వెలుగులోకి వచ్చిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా ఇక ఈ కాఫీ గురించి తెలుసుకున్న జనం... దీని ఖర్చుతో ఓ చిన్న పాటి వివాహం చేయవచ్చని అంటున్నారు. మరికొందరు అయితే పెద్ద విందునే ఏర్పాటు చేయవచ్చని చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

జీవితంలో సంతోషం ఉచ్ఛస్థితికి చేరేది ఈ ఏజ్‌లోనే అంటున్న శాస్రవేత్తలు

కారులో ఇంధనాన్ని ఆదా చేయాలనుకుంటున్నారా.. ఈ ఒక్క బటన్‌ను ప్రెస్ చేస్తే..

Updated Date - Oct 12 , 2025 | 05:44 PM