Health Tips: పవర్ ఫుల్ ఫ్రూట్.. షుగర్ వ్యాధిగ్రస్తులు చిన్న ముక్క తిన్నా చాలు..
ABN , Publish Date - Jan 13 , 2025 | 04:17 PM
షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండు చిన్న ముక్క తిన్నా చాలు.. బ్లడ్ షుగర్ నార్మల్ అవుతుంది. ఇంతకు ఆ పండు ఏంటి? ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
డ్రాగన్ ఫ్రూట్.. ఈ పండు ఎంతో కలర్ ఫుల్ గా ఉంటుంది. దీని ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధనవంతుల పండు అని కూడా అంటారు. అయితే, ఈ పండుకు ఎంత ఖర్చు పెట్టినా తప్పు లేదంటారు. ఎందుకంటే ఇది అంతలా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గించడంలో, మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో, మెరుగైన జీర్ణ క్రియ, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది.
ఈ పండులో ప్రొటీన్లు, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే, పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్స్, బీటాసైనిన్స్ వంటి మొక్కల సమ్మేళనాలు ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి, బీటా కెరోటిన్, లైకోపీన్, బెటాలైన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ కథనంలో డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి: డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్ సి, కెరోటినాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి.
జీర్ణక్రియ: డ్రాగన్ ఫ్రూట్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను చక్కగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఐరన్: డ్రాగన్ ఫ్రూట్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత ఉంటే డ్రాగన్ ఫ్రూట్ తినవచ్చు. దీన్ని రోజూ తింటే రక్తహీనత తగ్గుతుంది.
చర్మం: డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్ సి చర్మంలో కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది జుట్టును బలోపేతం చేయడంతోపాటు జుట్టు విరిగిపోకుండా ఉండేలా చేస్తుంది.
గుండె: డ్రాగన్ ఫ్రూట్‌లో ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
మధుమేహం: డ్రాగన్ ఫ్రూట్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండు. డయాబెటిక్ రోగులకు డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనకరంగా ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు చిన్న ముక్క తిన్నా బ్లడ్ షుగర్ నార్మల్ అవుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)