Health Tips: పీరియడ్స్ ఆలస్యంగా వస్తే ఏం చేయాలో తెలుసా..
ABN , Publish Date - Jan 26 , 2025 | 01:55 PM
పీరియడ్స్ సక్రమంగా లేకపోవడం వల్ల కొందరు మహిళలు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమయంలో వారు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి, లేట్ పీరియడ్స్ రాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలు తినాలి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొంతమంది స్త్రీలు తమ పీరియడ్స్ సమయానికి రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమయంలో వారు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి లేట్ పీరియడ్స్ రాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలు తీసుకోవాలి. ఏయే ఆహారాలు తీసుకోవాలో ఈ కధనంలో తెలుసుకుందాం..
దాల్చిన చెక్క
మీ పీరియడ్స్ సకాలంలో రావాలంటే దాల్చిన చెక్కను మీ ఆహారంలో చేర్చుకోవాలి. దాల్చిన చెక్కను ఉపయోగించడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా, పీరియడ్స్ సమస్య కూడా తగ్గుతుంది. కాబట్టి మీరు దాల్చిన చెక్కను టీ రూపంలో తీసుకోవచ్చు.
అల్లం
మీరు మీ ఆహారంలో అల్లం చేర్చుకోవాలి. అల్లంలో విటమిన్ ʼCʼ, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది క్రమరహిత పీరియడ్స్ సమస్యను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. మీరు దీనిని అల్లం డికాక్షన్, అల్లం రసం, అల్లం టీ రూపంలో తీసుకోవచ్చు.
పైనాపిల్..
పైనాపిల్ తీసుకోవడం ద్వారా మీరు క్రమరహిత పీరియడ్స్ నుండి బయటపడవచ్చు. ఇది శరీరంలో ఎరుపు, తెల్ల రక్త కణాలను అభివృద్ధి చేస్తుంది.
బొప్పాయి
పీరియడ్స్ సకాలంలో రావాలంటే బొప్పాయి పండును తినాలి. రెగ్యులర్ పీరియడ్స్‌కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కాఫీ
మహిళలు తమ ఆహారంలో కాఫీని కూడా చేర్చుకోవచ్చు. కాఫీ తీసుకోవడం వల్ల పీరియడ్స్ సకాలంలో రావడమే కాకుండా రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)