cardamom Chewing: భోజనం చేశాక ఇలాచీ తింటే ఎన్ని బెనిఫిట్సో..
ABN , Publish Date - Sep 02 , 2025 | 07:42 AM
భోజనం తరువాత అనేక మంది ఇలాచీ తింటారు. అయితే, ఈ అలవాటుతో బోలెడన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ బెనిఫిట్స్ ఏంటో, భోజనం తరువాత ఎన్ని ఇలాచీ పలుకులు తింటే మంచి ఫలితాలు ఉంటాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: భోజనం చేశాక పాన్ లేదా సోంపు తినడం భారతీయ సంస్కృతిలో ఎప్పటి నుంచో ఉన్నదే. జీర్ణక్రియను వేగవంతం చేసేందుకు పెద్దలు ఈ అలవాటును ప్రోత్సహించారు. పాన్, సోంపుతో పాటు కొందరు భోజనం చేశాక ఇలాచీ కూడా తింటుంటారు. మరి ఈ అలవాటుతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇలాచీ కేవలం మౌత్ ఫ్రెషనర్‌గానే కాకుండా ఇంకా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఇలాచీ ప్రస్తావన ఉంది. అందుకే దీన్ని సుంగధ ద్రవ్యాల రాణిగా పిలుస్తారు. ఎక్కువ మంది దీన్ని మౌత్ ఫ్రెషనర్‌గానే వాడతారు. ఇందులోని సహజసిద్ధమైన నూనెలు నోటి బ్యాక్టీరియాను అంతమొందించి దుర్వాసన లేకుండా చేస్తాయి. ముఖ్యంగా వెల్లుల్లి, ఉల్లిపాయ తిన్న తరువాత ఇలాచీ ఎంతో ఉపయోగపడుతుంది.
ఇలాచీలోని సినియోల్, ఇతర రసాయనాలు కడుపులో జీర్ణరసాలు మెరుగ్గా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. త్వరగా ఆహారం బాగా జీర్ణం అవుతుంది. భోజనం తరువాత ఇలాచీ నమిలితే కడుపుబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటివి కనుమరుగు అవుతాయి. కడుపు కండరాలు రిలాక్స్ అయ్యి ఇబ్బందులు తొలగిపోతాయి.
ఇలాచీలోని యాంటీఆక్సిడెంట్స్.. లివర్, కిడ్నీని మరింత క్రియాశీలకం చేసి విషతుల్యాలు తొలగిపోయేలా చేస్తాయి. క్రమం తప్పకుండా ఇలాచీ తినేవారిలో విషతుల్యాల తొలగింపు మరింత మెరుగ్గా ఉంటుంది.
ఇలాచీ తినే వారిలో ఆకలిపై కూడా అదుపు ఉంటుంది. స్వీట్స్, చక్కెర అధికంగా ఉన్న ఇతర పదార్థాల మీద మనసు మళ్లకుండా ఇలాచీ అడ్డుకట్ట వేస్తుంది. ఇలాచీ సువాసన కారణంగా మనసు రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఆహారం తినే విషయంలో నియంత్రణ పాటించేలా చేస్తుంది.
ఇక నిపుణులు చెప్పే దాని ప్రకారం, భోజనం తరువాత రోజుకు 1-2 ఇలాచీలు తింటే జీర్ణ వ్యవస్థ మెరుగవడంతో పాటు నోటి దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది. ఇలాచీ పౌడర్‌ను గోరువెచ్చని నీరు లేదా టీలో కలుపుకుని తాగితే జీర్ణక్రియలు వేగవంతం అవుతాయి. ఇలాచీని కొబ్బరిలో కలిపి మౌత్ వాష్‌గా కూడా వాడుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
ఏషియన్ ఇండియన్ ఫీనోటైప్.. షుగర్ వ్యాధికి ఇదీ ఓ కారణమని తెలుసా..
కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లల్లో రాత్రిళ్లు మాత్రమే కనిపించే సమస్యలు ఇవీ