Share News

Cancer Eradication: 2030 కల్లా క్యాన్సర్, అంధత్వం, పక్షవాతం కనుమరుగు.. వైద్య విద్యార్థి సంచలన ప్రకటన

ABN , Publish Date - Aug 12 , 2025 | 10:18 AM

2030 కల్లా క్యాన్సర్ సహా మూడు ప్రమాదకరమైన వ్యాధులు ప్రపంచం నుంచి కనుమరుగవుతాయంటూ బుడాపెస్టుకు చెందిన ఓ వైద్య విద్యార్థి పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది.

Cancer Eradication: 2030 కల్లా క్యాన్సర్, అంధత్వం, పక్షవాతం కనుమరుగు.. వైద్య విద్యార్థి సంచలన ప్రకటన
cancer blindness paralysis eradication 2030

ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక వైద్యశాస్త్రంలో పురోగతి కారణంగా అనేక రోగాలకు చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ప్రాణాంతకమైనవిగా భావించిన వాటికీ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే, 2030 నాటి కల్లా క్యాన్సర్, ఆంధత్వం, పక్షవాతం పీడ విరగడవుతుందని ఓ వైద్య విద్యార్థి చెప్పుకొచ్చాడు. ప్రపంచం నుంచి ఇవి పూర్తిగా కనుమరుగు అవుతాయని అన్నారు. బుడాపెస్ట్‌కు చెందిన వైద్య విద్యార్థి క్రిస్ క్రిసాంతూ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


క్యాన్సర్:

క్యాన్సర్‌కు చెక్ పెట్టే ఎమ్‌ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు కొన్ని ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. రోగ నిరోధక శక్తి స్వయంగా క్యాన్సర్ కణాలను తుడిపెట్టేందుకు ఈ టీకాలు దోహదపడతాయి. భవిష్యత్తులో ఒక్కో రోగికి వారి శరీర తత్వానికి అనువైన పర్స్‌నలైజ్డ్‌ వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. జన్యు ఎడిటింగ్ వంటి సాంకేతికతలతో శాస్త్రవేత్తలు ఈ కలను త్వరలోనే సాకరం చేస్తారని క్రిస్ చెప్పుకొచ్చారు.

అంధత్వం:

రెటినల్ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇప్పటికే జీన్ ఎడిటింగ్, స్టెమ్ సెల్స్‌ చికిత్సలు వరంగా మారాయి. కొందరికి చూపు కూడా తిరిగొచ్చింది. ఇక జన్యుపరంగా వచ్చే అంధ్వానికి కూడా చికిత్సలు రాబోతున్నాయని అతడు తెలిపారు. 'ప్రైమ్ ఎడిటింగ్' అనే కొత్త సాంకేతికతతో జన్యు లోపాలను సరి చేసి అంధత్వం నుంచి శాశ్వత విముక్తి కల్పిస్తారట.

పక్షవాతం

పగవాడికి కూడా రాకూడని వ్యాధి ఏదైనా ఉందీ అంటే అది పక్షవాతమే. ఈ రోగంతో మంచాన పడ్డ వారు అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడుతూ నరకం అనుభవిస్తుంటారు. అయితే, దీనికి కూడా శాశ్వత పరిష్కారాలు అందుబాటులోకి రానున్నాయని సదరు వైద్య విద్యార్థి చెప్పుకొచ్చారు. బ్రెయిన్‌లో ఇంప్లాంట్స్ (మైక్రో చిప్స్ లాంటివి) అమర్చడంతో పాటు వెన్నెముకను స్టిమ్యూలేట్ చేయడం వల్ల పక్షవాతానికి చెక్ పెట్టేందుకు వైద్యులు ప్రయత్నించి కొంత మేర విజయం కూడా సాధించారు. ఈ చికిత్సతో చైనాలో ఇద్దరు పక్షవాత రోగులు పూర్తిగా కోలుకున్నట్టు కూడా ఆ వైద్య విద్యార్థి తన వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ చికిత్సలో మెదడు నుంచి నేరుగా కాళ్లకు, చేతులకు నాడీ సిగ్నల్స్‌ను పంపించి పక్షవాతాన్ని సరి చేస్తారని వివరించారు.


ఈ పోస్టుపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అతడి పోస్టుపై పెదవి విరిచారు. భారీ లాభాలకు అలవాటు పడ్డ ఫార్మా కంపెనీలు ఇలాంటి శాశ్వత పరిష్కారాలకు మోకాలు అడ్డు పెటొచ్చని సందేహం వ్యక్తం చేశారు. మరి హెచ్‌ఐవీ పరిస్థితి ఏమిటని కొందరు ప్రశ్నించారు. షుగర్ వ్యాధిని తుడిచిపెట్టే చికిత్సలపై చైనాలో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. ఇలా రకరాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

ఆరోగ్యానికి భారీ కసరత్తులు తప్పనిసరి అని భావిస్తున్నారా.. ఈ ప్రొఫెసర్ ఏం చెబుతున్నారంటే..

బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..

Read Latest and Health News

Updated Date - Aug 12 , 2025 | 10:49 AM