Health: అతిగా నవ్వితే మరణం! కారణాలు ఇవే!
ABN , Publish Date - Jan 10 , 2025 | 07:22 PM
కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు అతిగా నవ్వితే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. తతిమా సందర్భాల్లో నవ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మనసారా హాయిగా నవ్వుకునే వారు కలకాలం ఆరోగ్యంగా జీవిస్తారన్న విషయం తెలిసిందే. అయితే, అతిగా నవ్వితే ఒక్కోసార మరణం కూడా రావొచ్చట. ఇందుకు సంబంధించి చరిత్రలో జరిగిన మూడు ఘటనలు నిపుణులను ఇప్పటికీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి.
క్రీస్తుపూర్వం గ్రీకు దేశంలో జీవించిన సోలీ అనే ఓ స్టాయిక్ తత్వవేత్త అతిగా నవ్వి చనిపోయారన్న కథనం ప్రచారంలో ఉంది. 73 ఏళ్ల వయసులో ఆయన ఓసారి గాడిదకు ఎవరో మద్యం ఇస్తుండగా చూసి నవ్వాపుకోలేక పోయారట. చివరకు నవ్వుతూనే కుప్పకూలిపోయారట (Health)..
ఇక ఆధునిక జమానాలో ఓ ఇంగ్లాండ్ వ్యక్తి కూడా దాదాపు ఇదే తీరులో కన్నుమూశారు. 1975లో అలెక్స్ మిచెల్ అనే వ్యక్తి ఓ కామెడీ షో చూస్తూ పొట్టచెక్కలయ్యేలా నవ్వి చివరకు కన్నుమూశారట. ఏకధాటిగా 25 పాటు నవ్వి చివరకు కూర్చొన్న చోటునే తలవాల్చేశారట. గుండెపోటు రావడంతో అలెక్స్ మరణించినట్టు ఆ తరువాత పోస్టు మార్టం నివేదికలో తేలింది. అయితే, నవ్వుతూనే తన భర్త పోవడంపై అలెక్స్ భార్య స్పందిస్తూ ఇది నిజంగా ఆయన చేసుకున్న అదృష్టమే అని వ్యాఖ్యానించింది.
Boiled Egg Vs Omlette: ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. వీటిల్లో ఏది బెటరంటే..
నిపుణులు చెప్పే దాని ప్రకారం, కొన్ని సందర్భాల్లో అతిగా నవ్వితే మరణం సంభవించే అవకాశాలు ఉన్నాయి.
అతిగా నవ్వినప్పుడు గుండె వేగం విపరీతంగా పెరుగుతుందట. గుండె అప్పటికే బలహీనంగా ఉన్న వారికి అతిగా నవ్వడం మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
అతిగా నవ్వితే ఊపిరితిత్తులకు తగినంత ఆక్సీజన్ అందక హైపాక్సియా తలెత్తే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ఒక్క సారిగా బీపీ, గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గిపోతుంది. ఈ పరిస్థితి చివరకు కార్డియాక్ అరెస్టుకు దారి తీయొచ్చు.
Smoking: రోజుకు ఒక్క సిగరెట్ తాగితే ఏం కాదని అనుకుంటున్నారా? ఇది ఎంతటి ప్రమాదమో తెలిస్తే..
ఇక హైబీపీ ఉన్న వాళ్లు అతిగా నవ్వితే మెదడులో ఒత్తిడి పెరిగి స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంది. గుండె బలహీనంగా ఉన్న వాళ్లు ఇలాంటి పరిస్థితుల్లో గుండె పోటుకు గురవుతాయరు. ఇక ఆర్టరీలు బరస్ట్ అయితే అంతర్గత రక్తస్రావం జరిగి మరణం సంభిస్తుంది. అయితే, ఇవన్నీ అసాధారణ పరిస్థితుల్లో తలెత్తే పరిణామాలేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా మనసారా నవ్వుకుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసుకు సాంత్వన లభిస్తుందని భరోసా ఇస్తున్నారు.