Share News

Banana Leaf: వావ్.. అరటి ఆకులో భోజనం చేస్తే ఇన్ని ప్రయోజనాలా?

ABN , Publish Date - Oct 28 , 2025 | 10:59 PM

అరటి ఆకులో భోజనం చేసే సంప్రదాయం తరతరాలుగా వస్తున్నదే. మరి ఇలా భోజనం చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

Banana Leaf: వావ్.. అరటి ఆకులో భోజనం చేస్తే ఇన్ని ప్రయోజనాలా?
banana leaf eating benefits

ఇంటర్నెట్ డెస్క్: అరటి ఆకులపై భోజనం చేయడం భారత దేశంలో సాధారణంగా కనిపించే సంప్రదాయం. ఈ అలవాటుతో వెల కట్టలేని అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అరటి ఆకుల్లో సూక్ష్మక్రిములను మట్టుపెట్టే పాలీఫినాల్స్ అనే రసాయనాలు ఉంటాయి. వీటికి యాంటీఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి అరటి ఆకులో వేడి వేడి ఆహారం వడ్డించినప్పుడు స్వల్ప మొత్తంలో విడుదలయ్యే పాలీఫినాల్స్‌తో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది (Banana Leaf Benefits).

వేడి వేడి భోజనాన్ని అరటి ఆకులో వడ్డించినప్పుడు సువాసనలు విడుదల అవుతాయి. ఇవి ఆహారంలో కలిసి రుచిని మరింత పెంచుతాయి. సాంబార్, రసమ్ వంటి ఫుడ్స్ అరటి ఆకులో తిన్నప్పుడు మరింత రుచిగా అనిపిస్తాయి


అరటి ఆకులో భోజనం చేయడం పర్యావరణానికి హితకరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి త్వరగా మట్టిలో కలిసిపోయి ఎరువుగా మారతాయి. భూసారాన్ని పెంచుతాయి. ప్లాస్టిక్ ప్లేట్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు అరటి ఆకులకు ఉండవు.

ఇక ఇతర ఆకులతో పోలిస్తే అరటి ఆకులు వేడిని బాగా తట్టుకోగలవు. వేడి వేడి అన్నం వడ్డించినా కూడా తట్టుకుంటాయి. అరటిపై ఉండే పలుచటి పొర కారణంగా భోజనం ఆకుకు అంటుకోదు. దీంతో, సౌకర్యంగా భోజనం చేసే అవకాశం ఉంటుంది.

అరటి ఆకులో తినే వారు సాధారణంగా సంప్రదాయ పద్ధతిలో కింద కూర్చుని తింటారు. ఇలా స్థిమితింగా కూర్చుని తినడం వలన జీర్ణక్రియలు మెరుగవుతాయి. ఆరోగ్యం ఇనుమడిస్తుంది. ఇలా అరటి ఆకులో భోజనంతో అనేక ప్రయోజనాలు ఉండటంతో ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి

యాంటీబయాటిక్స్ మందులను కోర్సు పూర్తి కాకుండానే ఆపేస్తున్నారా? రిస్క్‌లో పడ్డట్టే..

కాంటాక్ట్ లేన్స్‌ను వాడతారా? ఈ పొరపాట్లతో చూపునకు ముప్పు

Read Latest and Health News

Updated Date - Oct 28 , 2025 | 11:15 PM