Universe: అనంతమైన విశ్వం.. ఆశ్చర్యం కలిగించే విషయాలు
ABN, Publish Date - Oct 28 , 2025 | 10:50 PM
విశ్వం గురించి శాస్త్రవేత్తలు కనుగొన్న అంశాల్లో పలు ఆశ్చర్యకర విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
1/7
అంతరిక్షంలో ధ్వని తరంగాలు పయనించలేవు.
2/7
భూమ్మీద నుంచి చూస్తే చంద్రుడు గుండ్రంగా కనిపిస్తాడు కానీ వాస్తవానికి నిమ్మకాయ ఆకారంలో ఉంటాడని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
3/7
భూమికి, చంద్రుడికి మధ్య సౌరమండలంలోని గ్రహాలన్నీ పట్టేంత గ్యాప్ ఉంటుంది.
4/7
సూర్యుడి చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి నెప్ట్యూన్ గ్రహానికి 165 సంవత్సరాలు పడుతుంది.
5/7
సాధారణంగా గ్రహాలన్నీ ఏదోక నక్షత్రం చుట్టూ తిరుగుతుంటాయి. కొన్ని గ్రహాలు మాత్రం నిర్దిష్ట దశ లేకుండా అంతరిక్షంలో అలా పయనిస్తూనే ఉంటాయి.
6/7
విశ్వంలో దాదాపు 68 శాతం డార్క్ ఎనర్జీ అనే అదృశ్య శక్తే. విశ్వం విస్తరించడానికి ఈ శక్తే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
7/7
అంతరిక్షంలో వ్యోమగాముల వయసు భూమ్మీద కంటే నెమ్మదిగా పెరుగుతుంది. శాస్త్రపరిభాషలో దీన్ని టైమ్ డైలేషన్ అని అంటారు.
Updated at - Oct 28 , 2025 | 10:54 PM