Himalayan Rock Salt: గ్లాసులో ఈ ఉప్పు చిటికెడు వేసుకుని తాగితే ఎన్ని బెనిఫిట్సో..
ABN , Publish Date - Mar 03 , 2025 | 10:35 PM
జిమ్‌లో కసరత్తులు చేసొచ్చాక ఎంతకీ అలసట తీరడం లేదంటే ఒంట్లో ఖనిజ లవణాలు తక్కువయ్యాయని అర్థం. ఇలాంటప్పుడు నీటితో కాస్త సైంధవ లవణం వేసుకుని తాగితే వెంటనే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: జిమ్‌లో కసరత్తులు చేశాక బాగా అలసిపోయినట్టు అనిపిస్తోందా? త్వరగా కోలుకున్నట్టు అనిపించట్లేదా? అయితే ఈ కథనం మీ కోసమే. చెమట రూపంలో ఎక్కవగా నీరు కోల్పోతే ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. దీని వల్ల డీహైడ్రేషన్, అలసట వస్తుంది. అయితే, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఓ సహజసిద్ధమైన పరిష్కారం ఉంది.
ఎక్కువగా కసరత్తులు చేసినప్పుడు శరీరంలోంచి స్వేదం అధికంగా పోతుంది. దీంతో, ఒంట్లో నీటి శాతం బాగా తగ్గుతుంది. ఫలితంగా నీరసం ఆవహిస్తుంది. స్వేదంతో పాటు ఒంట్లోని లవాణాలు కూడా బయటకుపోతాయని కాబట్టి నీరసం మరింత పెరుగుతుంది. అయితే, గ్లాసు నీటిలో చిటికెడుకు కాస్త తక్కువగా ఉప్పు వేసుకుని తాగితే వెంటనే కోలుకుంటారు (Himalayan Rock Salt).
అయితే, ఇలాంటి సందర్భాల్లో సాధారణ ఉప్పుకు బదులు సైంధవ లవణం వాడాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి లవణాలు ఉంటాయి. ఇవన్నీ నీరు ఒంట్లో నిలిచి ఉండేలా చేస్తాయి. వీటి వల్ల ఒంట్లో ఖనిజాలను తగినంత స్థాయిలో నిలిపి ఉండొచ్చు. దీని వల్ల డీహైడ్రేషన్ ముప్పు తగ్గుతుంది.
ఇక సైంధవ లవణంలోని సోడియం, క్లోరిన్ లవణాలతో కడుపులో జీర్ణరసాలు పెరుగుతాయి. ఫలితంగా జీర్ణ క్రియ వేగవంతమవుతుంది. దీంతో, కడుపుపుబ్బరం, అరగనట్టు ఉండటం, ఇతర ఉదర సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
Coconut water High Potassium: కొబ్బరి నీళ్లతో ఇలాంటి రిస్కులు కూడా ఉంటాయి జాగ్రత్త!
శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ నిర్వహణకు కావాల్సిన ముఖ్య ఖనిజ లవణాలన్నీ ఈ ఉప్పులో ఉంటాయి. దీంతో, స్వేదం ద్వారా బయటకు పోయిన ఖనిజలవణాలను ఈ నీటితో భర్తీ చేసుకోవచ్చు. ముఖ్యంగా కసరత్తుల తరువాత ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌తో కండరాలు, నాడీ వ్యవస్థ, శక్తి స్థాయిలు అన్నీ కావాల్సిన స్థాయిలో ఉంటాయి. కాబట్టి, జిమ్‌కు వెళ్లొచ్చిన తరువాత ఎంతకీ అలసట తీరడం లేదంటే ఈ ఉప్పు వేసిన నీరు తాగండి ఫలితం ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది.
Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలోకు రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా