Winter Blood Pressure Care: శీతాకాలంలో రక్తపోటు పెరగకుండా ఈ 5 జాగ్రత్తలు తీసుకోండి.!
ABN , Publish Date - Nov 24 , 2025 | 06:41 PM
శీతాకాలంలో రక్తపోటు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలంలో రక్తపోటు (BP) పెరగడం సాధారణం. ఎందుకంటే చల్లని వాతావరణం వల్ల రక్తనాళాలు సంకోచించి, గుండె రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువ ఒత్తిడిని ఉపయోగించాల్సి వస్తుంది. వృద్ధులు, ఇప్పటికే అధిక రక్తపోటు ఉన్నవారు ఈ మార్పుల వల్ల గుండె జబ్బులు లేదా స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల, చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వెచ్చని దుస్తులు ధరించండి
శీతాకాలంలో వెచ్చని దుస్తులు ధరించడం ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. వెచ్చని దుస్తులు చలి కారణంగా రక్తనాళాలు కుంచించుకుపోవడాన్ని నిరోధించి, రక్త ప్రసరణ సక్రమంగా ఉండేలా చేస్తుంది. అందువల్ల, ఈ సీజన్‌లో వెచ్చని దుస్తులు ధరించడం ముఖ్యం.
ఇండోర్ వాకింగ్, స్ట్రెచింగ్
శీతాకాలంలో బయట ఉష్ణోగ్రతల కారణంగా వర్కవుట్ చేయడం కష్టం. అయితే, ఇంట్లోనే వాకింగ్, స్ట్రెచింగ్ చేయడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
తగినంత నీరు తాగండి
శీతాకాలంలో దాహం వేయకపోయినా నీరు తాగడం చాలా ముఖ్యం, చల్లని వాతావరణంలో శరీరం నిర్జలీకరణానికి గురయ్యే అవకాశం ఉంది. నిర్జలీకరణం వల్ల తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలా కాకుండా, రోజు తగినంత నీరు తాగడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది.
ఇంట్లో ఆహారం తినండి
శీతాకాలంలో ప్రాసెస్ చేసిన ఆహారం తినాలని అనిపించడం సహజం. ఎందుకంటే చలి వాతావరణం శరీరం నుండి వెచ్చదనాన్ని కోరుకుంటుంది. అయితే, బయట ఫుడ్ తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఇంట్లో వండిన తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం అస్సలు తినకూడదు.
రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి
శీతాకాలంలో రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేయడం చాలా ముఖ్యం. మీ రక్తపోటును ఇంట్లో డిజిటల్ మానిటర్‌తో క్రమం తప్పకుండా చెక్ చేయండి. రీడింగ్‌లు ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించండి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం.. ముగ్గురు మృతి
సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..
For More TG News And Telugu News