Share News

Summer Health Tips: ఈ హెల్తీ డ్రింక్‌తో 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:29 PM

ఈ వేసవిలో అల్లం, పసుపుతో కలిపి తయారుచేసిన హెల్తీ డ్రింక్‌ తాగితే 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Summer Health Tips: ఈ హెల్తీ డ్రింక్‌తో 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
Ginger and Turmeric Water

సమ్మర్‌లో హైడ్రేషన్ కోసం చాలా మంది రకరకాల పానీయాలు తీసుకుంటారు. అయితే, మనం తీసుకునే పానీయాలు కేవలం హైడ్రేషన్ కోసం మాత్రమే కాకుండా మనకు రోగనిరోధక శక్తిని పెంచేలా సహాయపడే పోషకాలను కలిగి ఉండాలి. ఈ వేసవిలో అల్లం, పసుపుతో కలిపి తయారుచేసిన హెల్తీ డ్రింక్‌ తాగితే 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. రోగనిరోధక శక్తి

వేసవి కాలం వేడిని మాత్రమే కాకుండా ఇన్ఫెక్షన్లు, కాలానుగుణ ఫ్లూ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. పసుపు, అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు అనారోగ్యాలకు చెక్ పెడతాయి. ఈ రెండు సహజంగా రోగనిరోధక శక్తిని పెంచేలా పనిచేస్తాయి. మీ శరీరం ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో అల్లం, పసుపు నీరు ఎంతగానో సహాయపడుతుంది.

2. జీర్ణక్రియ

వేసవిలోె అల్లం, పసుపుతో కలిపిన హెల్తీ డ్రింక్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. పసుపు పేగులోని మంటను తగ్గిస్తుంది. ఉదయం పూట అల్లం, పసుపు నీరు తాగితే ఉబ్బరం తగ్గిపోవడంతో పాటు పేగు ఆరోగ్యంగా ఉంటుంది.


3. సహజ డిటాక్సిఫైయర్

వేడి వాతావరణం తరచుగా శరీరంలో అలసట, టాక్సిన్ పేరుకుపోవడానికి దారితీస్తుంది. అల్లం, పసుపు నీరు కాలేయ పనితీరుకు సహాయపడుతాయి. వాటి యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రక్తాన్ని శుభ్రపరచడానికి, చర్మంను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది .

4. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది

వేసవిలో చాలా మంది ఎక్కువుగా కీళ్ల నొప్పులు, వాపు సమస్యలతో బాధపడుతారు. అలాంటి వారికి అల్లం, పసుపుతో కలిపి చేసిన హెల్తీ డ్రింక్ ఎంతగానో సహాయపడుతుంది. ఈ పానీయం వాపును తగ్గించడంలో సహాయపడటమే కాకుండా నొప్పిని కూడా త్వరగా తగ్గిస్తుంది.

5. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది

డీహైడ్రేషన్, వేడి చర్మాన్ని దెబ్బతీస్తాయి. అల్లం, పసుపు నీరు ముఖంపై ఉన్న మొటిమలను తగ్గించడం మాత్రం కాకుండా, సూర్యరశ్మి వల్ల కలిగే నష్టాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా, చర్మానికి లోపలి నుండి సహజమైన మెరుపును ఇస్తుంది.


(NOTE:పై సమాచారం ఆరోగ్య నిపుణుల ఆధారంగా మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

Rain Alert: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. రానున్న గంటలో

Suicide Plant: ఈ మొక్కను తాకితేనే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందంట.. పాము విషం కంటే డేంజర్..

Vastu Tips: రోడ్డుపై డబ్బు కనిపిస్తే సంపదకు సంకేతమా లేదా ఇబ్బందుల హెచ్చరికనా..

Updated Date - Apr 10 , 2025 | 04:29 PM